దరఖాస్తుల ఆహ్వానం
ఖమ్మం, అక్టోబర్ 9 : జిల్లా ఉద్యన శాఖలో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జేసీ ఎంఎంనాయక్ తెలిపారు. హార్టికల్చర్ కన్సల్టెంట్ పోస్టులు 4, అకౌంటెంట్ పోస్టులు 11, డేటా ఎంట్రీ ఆపరేటర్లు రెండు, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు ఆరు భర్తీ చేస్తామన్నారు. హార్టి కల్చర్ కన్సల్టెంట్ పోస్టుకు డీఎస్సీ హార్టికల్చర్, లేదా ఎంఎస్సీ అర్హత గలవారు, అకౌంటెంట్ పోస్టుకు వ్యవసాయ, హార్టికల్చర్, ట్రెజరీ, కో ఆపరేటివ్ శాఖలో పనిచేసి పదవీ విరమణ పొందిన వారు, బీకాం డిగ్రీ కలిగిన వారు అర్హులని జేసీ తెలిపారు. డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కంప్యూటర్ డెటాఎంట్రీలో డిగ్రీతోపాటు పీజీడీసీఏ, లేదా డీసీఏ పట్టా పొందన వారు అర్హులన్నారు. ఫీల్డ్ కన్సల్టెంట్ పోస్టుకు హార్టకల్చర్‌లో డిప్లొమా, లేదా అగ్రికల్చర్‌లో డిప్లొమా, బీఎస్సీ జీవశాస్త్రం చదివిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన ఆయన తెలిపారు.