దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్‌, నవంబర్‌ 3 : 2012-13 సంవత్సరానికి గాను పరిపాలన న్యాయశాస్త్రంలో శిక్షణ పొందుటకు గాను నిజామాబాద్‌ జిల్లా వాసులైన వెనుకబడిన తరగతులకు చెందిన లా గ్రాడ్యుయేట్ల నుండి దర ఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వెనుక బడిన తరగతుల సంక్షేమాధికారి రాజయ్య తెలిపారు. పరిపాలన న్యాయ శాస్త్రంలో శిక్షణ పొందుటకు అభ్యర్థులను నిబంధనలకు లోబడి ఎంపిక చేస్తామన్నారు. అభ్యర్థులు భారత దేశంలో కేంద్ర చట్టం, ప్రొవెన్షియల్‌ చట్టం, రాష్ట్ర చట్టం క్రింద స్థాపించబడిన లేదా చేర్చబడిన ఏ యూనివర్సిటి నుండి అయినా కేంద్రీయ విశ్వ విద్యాలయ గ్రాంట్స్‌ కమీషన్‌ గుర్తించిన విద్యాసంస్థల నుండి అయినా లా డిగ్రీ హోల్డర్‌ అయి ఉండాలన్నారు. 1 జూలై 2012 నాటికి 23 సంవత్సరాలు నిండి ఉండాలని, 35 సంవత్సరాలకు మించి ఉండరాదన్నారు. అభ్యర్థి గతంలో ఈ సౌకర్యం వినియోగించుకొని ఉండరాదని, అభ్యర్థి తల్లితండ్రుల, సంరక్షకుల ఆదాయం ఏడాదికి రూ.44500లకు మించరాదని, బార్‌ కౌన్సిల్‌లో మూడు నుండి ఏడు సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉండాలని, ఎంపికైన అభ్యర్థులకు మూడేళ్ల శిక్షణ కాలంలో నెలకు రూ.500 చొప్పున స్టైఫండ్‌ చెల్లిస్తామన్నారు. లా పుస్తకాలు, పర్నీచర్‌ కొనుగోలుకు రూ.3వేలు శిక్షణ కాలంలోని మొదటి సంవత్సరం మంజూరీ చేయబడుతుందని, ఎంపికైన అభ్యర్థులు, శిక్షణ కోసం జిల్లాలోని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, గవర్నమెంట్‌ ఫ్లీడరు, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లకు అనుబంధం చేయబడతారని ఆయన వివరించారు. శిక్షణ పొందగోరు ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారాలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖాధికారి కార్యాలయం, ప్రగతి భవన్‌ మొదటి అంతస్తు, నిజామాబాద్‌ వద్ద ఈ నెల 9 లోపు పొంది పూర్తి చేసిన దరఖాస్తు ఫారాలను 12న సాయంత్రం 5 గంటలలోగా అందజేయాలన్నారు.

తాజావార్తలు