దరఖాస్తు చేసుకున్న ప్రతి క్లైమ్ ను సర్వే చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక

గంగారం అక్టోబర్ 20 (జనం సాక్షి)

దరఖాస్తు చేసుకున్న ప్రతి క్లైమ్ ను సర్వే చేయాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి హక్కు పత్రాలను అందించే విధంగా ఎఫ్ఆర్ సి కమిటీలు సర్వే బృందాలతో సహకరించాలని జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. పోడు భూముల పట్టాల జారీకై జిల్లాలో జరుగుతున్న సర్వే ప్రక్రియను గురువారం గంగారం మండలం తిరుమల గండి గ్రామంలో కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ సి

కమిటీ సభ్యులకు, సర్వే బృందాలకు
 జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఎఫ్ ఆర్ సి కమిటీ సర్వే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించి సర్వే బృందానికి సహకరించాలని చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని
కలెక్టర్ అన్నారు. సాక్షాధారాలను పకడ్బందీగా సరి చూడాలని ఇప్పటికే చేపట్టిన క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియను పూర్తిస్థాయిలో ఆన్ లైన్ చేయాలని రెవెన్యూ అటవీశాఖ, మండల పరిషత్ అధికారులు సంయుక్తంగా ఇట్టి ప్రక్రియను పకడ్బందీగా పూర్తిచేసి నివేదికను గ్రామ సభలకు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.మండల స్పెషల్ ఆఫీసర్ బాలరాజు, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, తహసిల్దార్ సూర్యనారాయణ, ఎఫ్ఆర్ఓ చలపతిరావు, ఎండి వజాహత్ ఎఫ్ఆర్ సి కమిటీ సభ్యులు, స్థానిక సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు
Attachments area