దరఖాస్తు చేసుకోండి
కడప, జూలై 29 : జిల్లాలో ఈ ఏడాది బ్యాంకు రుణాలు, సబ్సిడీ యూనిట్ల ఏర్పాటుకు ఎస్‌సి, ఎస్‌టిలు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టరు అనిల్‌కుమార్ చెప్పారు. జిల్లాలో సబ్సిడీతో కూడిన 1393 యూనిట్లు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఒక్కో యూనిట్ విలువ 75వేలు ఉంటుందని, 30 వేలకు మించకుండా సబ్సిడీ ఉంటుందన్నారు. అన్ని మునిసిపల్ కార్యాలయాలు, మండల అభివృద్ధి ఎంపిడివోల కార్యాలయాల్లో వచ్చే నెల నాలుగో తేదీ నుంచి దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. 8వ తేదీలోగా లబ్ధిదారులు తమ దరఖాస్తులను అందించాలని చెప్పారు. ఆ నెల 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు లబ్దిదారుల ఎంపిక ఉంటుందని చెప్పారు. అర్హత కలిగిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.