దళితబంధుకు మరో 300 కోట్లు

విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

పైలట్‌ ప్రాజెక్టుకు 1500 కోట్లు జమ

త్వరలో మరో రూ.500 కోట్లు

హుజూరాబాద్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి):

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకం కోసం బుధవారం ప్రభుత్వం మరో రూ.300 కోట్లు విడుదల చేసింది. హుజూరాబాద్‌లో ఖర్చు చేయడానికి వీలుగా కరీంనగర్‌ కలెక్టర్‌ ఖాతాకు రూ.300 కోట్లను బదిలీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం మూడువిడతలుగా రూ.1,200 కోట్లు విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన రూ.300 కోట్లతో కలిపి మొత్తం రూ.1,500 కోట్లు రిలీజ్‌ అయ్యాయి. త్వరలో మరో రూ.500 కోట్లను కరీంనగర్‌ కలెక్టర్‌ ఖాతాకు బదిలీ చేయనున్నది. మొత్తం రూ.రెండు వేల కోట్లతో నియోజకవర్గంలోని దళితులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నది.