దళిత,వెనకబడిన వర్గాలతోపాటు ముస్లింలకు సమానలబ్ధి
– మైనారిటీ యువతను గొప్ప కాంట్రాక్టర్లుగా చూడాలని ఉంది
– అన్యాక్రాంతమైన వక్ఫ్ భూములను తిరిగి అప్పగిస్తాం
– మైనారిటీ సంక్షేమంపై సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్ ,ఫిబ్రవరి 28(జనంసాక్షి):
మైనార్టీ సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష ను నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి ఎంపీ వినోద్, ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్భరుద్దీన్ ఒవైసీతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ముస్లింలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరును సీఎం కేసీఆర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముస్లిం యువతకు ఇంజినీరింగ్, ఉన్నత విద్య, వృత్తి విద్య రంగాల్లో ప్రభుత్వ ఖర్చుతో ఉన్నతమైన శిక్షణను అందించాలని అధికారులను ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి ఎంపీ వినోద్, ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్భరుద్దీన్ ఒవైసీతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ షాదీముబారక్ ద్వారా క్షేత్రస్థాయిలో ఇప్పటివరకు 26,635 మంది లబ్ది పొందుతున్నారని అన్నారు.
పేద ముస్లిం యువతకు చేరాల్సిన నిధులు పక్కదారి పట్టించే బ్రోకర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. షాదీముబారక్ పథకం సహా స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్, డబుల్‌బెడ్‌రూం ఇండ్లు, ఉపాధి శిక్షణ, ఉద్యోగాల కల్పన,స్కిల్ డెవలప్‌మెంట్ పథకాలన్నీ ముస్లిం లబ్దిదారులకు అందాలని సూచించారు. మైనార్టీ సంక్షేమాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేయడంతోపాటు బడ్జెట్‌లో పక్షపాతం చూపించారని అన్నారు. మైనార్టీ సంక్షేమానికి సరిపోను బడ్జెట్‌ను కేటాయించామని.. ఎన్ని నిధులు ఖర్చయినా మైనార్టీల కోసం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు అవాంతరాలు లేకుండా కొనసాగాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అన్యాక్రాంతమైన వక్ఫ్‌భూములను గుర్తించి వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. ముస్లిం యువతకు అవకాశం దొరికితే అద్భుతమైన ప్రయోజకులుగా మారుతారని అన్నారు. ముస్లిం యువతకు గొప్పగొప్ప కాంట్రాక్టర్లుగా చూడాలన్నదే తన ధ్యేయమన్నారు. మైనార్టీ యువతకు టీఎస్‌ఐపాస్ కింద ఐటీ పార్కులను ఏర్పాటు చేసి ఎంటర్‌ప్రిన్యూర్స్‌గా తయారుచేయాలని సూచించారు. పోటీ పరీక్షల్లో పాల్గొనే ముస్లిం విద్యార్థులకు తమ మాతృభాష ఉర్దూలో రాసేందుకు అనుమతివ్వాలని సూచించారు. అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధి కల్పనలో ముస్లిం యువతకు అధికారులు అండగా నిలువాలని సూచించారు. అర్హులైన యువతకు ఆర్థిక సాయమందించే దిశగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పని విధానాన్ని మరింత మెరుగుపర్చాలని సూచించారు. హుస్సేనిషావలి షావలి దర్గా, బియాబాని దర్గా, ఫకీర్‌ముల్లా దర్గా, ఇతర దర్గాలకు చెందిన వందల ఎకరాల భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని ఆదేశించారు. మైనార్టీ సంక్షేమ పథకాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి ఎంపీ వినోద్, ఎంఐఎం నేతలు అసదుద్దీన్ ఒవైసీ, అక్భరుద్దీన్ ఒవైసీతోపాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తక్షణమే సర్వే నిర్వహించి వక్ఫ్ బోర్డుకు అందించాలని ఆదేశించారు. మక్కామసీదు కట్టడానికి సంబంధించిన పునరుద్దరణ పనులు, రంజాన్ పండుగలోపు పూర్తవుతాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే మైనార్టీ సంక్షేమంపై విస్తృతస్థాయి సవిూక్ష చేపడ్తామని తెలిపారు. రానున్న ఏప్రిల్ నెలలో చేపట్టబోయే పోలీస్ నియామకాల్లో ముస్లిం యువత భాగస్వామ్యం మరింత పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యున్నత నాణ్యత కలిగిన శిక్షణా సంస్థలను గుర్తించి కోచింగ్ ఇప్పించాలని సూచించారు. జూన్ నెల నుంచి మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఉద్యోగ నియామకాలను తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. సీకింగ్ సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ఎక్కువ సంఖ్యలో అవసరమైతే అర్హులైలైన ఇతరులను ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించుకోవాలని..నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. దారుల్ ఉల్‌మ్‌లో ఆడిటోరియం నిర్మాణానికి రూ.10కోట్లు విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. పాతబస్తీలో పలు చోట్ల నిర్మించ తలపెట్టిన జూనియర్, డిగ్రీ కాలేజ్‌ల భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
బడ్జెట్‌లో మైనారిటీ సంక్షేమానికి రూ.2 కోట్లు కేటాయించండి
ఓవైసీ సోదరులు
హైదరాబాద్,ఫిబ్రవరి 28(జనంసాక్షి):
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈరోజు ఒవైసీ సోదరులు కలిశారు. పలు సమస్యల పరిష్కారంపై కేసీఆర్‌కు వినతులు సమర్పించారు. అనంతరం అస దుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ… విద్యార్థులకు ఇవ్వా ల్సిన పాత బకాయిలను వెంటనే విడుదల చేయాల ని, బడ్జెట్‌లో మైనారిటీలకు రూ.2కోట్లు నిధులు పెం చాలని ముఖ్యమంత్రిని కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో 70 మైనారిటీ పాఠశాలలు ఏర్పాటు చేయా లని కూడా కేసీఆర్‌ను కోరామన్నారు.




