దళితులకు 300 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి..

— కెవిపిఎస్  జిల్లా కమిటీ ఆధ్వర్యంలో.. కరెంటు డివిజనల్ ఆఫీసర్లు ఏడి. డి ఈ లకు వినతి పత్రం అందజేత…
హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి
 కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ వందల ఎకరాలు ఉన్న భూస్వాములకు. ధనవంతులకు. కోట్ల రూపాయలు కూడా పెట్టుకున్న పారిశ్రామికవేత్తలకు కరెంటు మీద రాయితీలు ఇచ్చే ఈ ప్రభుత్వం. రోజు రెక్కల కష్టంతో బ్రతుకుతున్న దళితులకు మాత్రం ఇంటికి మీటర్లు పెట్టి ప్రతి నెల కరెంట్ బిల్లు వసూలు చేస్తోందని. ఈ ప్రభుత్వం భూస్వాములకు పెట్టుబడిదారులకు అనుకూలంగా పనిచేస్తుందని. దళితులకు ఇచ్చిన వాగ్దాలను అమలు చేయడం లేదని అన్నారు.
జీవో నెంబర్ 342 ప్రకారం దళితులకు 101 యూనిట్స్ విద్యుత్ ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా. క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇవ్వలేని కారణంగా అది కూడా అమలు కావడం లేదని అన్నారు. దళితుల కోసం పది కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అనుమకొండ డివిజనల్ ఆఫీసుకు జమ చేసిన ఈ నిధులను కూడా వినియోగించుకోలేని పరిస్థితి దళితులకు ఉందన్నారు .
కేరళ. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు 300 యూనిట్స్ వరకు ఉచిత కరెంటు ఇస్తున్నాయని. తెలంగాణ ప్రభుత్వం కూడా 342 జీవోను సవరించి 300 యూనిట్స్ వరకు ఉచిత కరెంటు ఇవ్వాలని అన్నారు. లేనిచో కెవిపిఎస్ హనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి సాంబయ్య. ఉపాధ్యక్షులు దూడపాక రాజేందర్. ముడుసు నారాయణ. జిల్లా సహాయ కార్యదర్శులు దానబోయిన రాంబాబు గడ్డం అశోక్. జిల్లా కమిటీ సభ్యులు హర్షం రామ్ కి గద్దల బద్రి రేణిగుంట్ల సుమన్ రాకేష్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.