దళితులపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

గుండామల్లేశ్‌

హైదరాబాద్‌ : రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లిలో దళితులపై దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారం రోజుల క్రితం దళితులపై దాడి జరిగినా.. కేసు నమోదు చేయకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈ దాడిలో గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. దళితులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.