దళితులపై వరుస దాడులకు పాల్పడుతున్న ప్రభుత్వం వెంటనే దిగిపోవాలి
-దళిత యువకుల ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనపై విచారణ జరపాలి
-కారకులైన జడ్పీటీసీ శరత్, మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డిలపై కూడా చర్య తీసుకోవాలి
-ఎమ్మెల్యే బాధ్యత వహించి రాజీనామా చేయాలి
-ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం
-వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్
కరీంనగర్, సెప్టెంబర్ 4 (జనంసాక్షి):రాష్ట్రంలో దళితుడిని మఖ్యమంత్రి చేస్తానని ఆధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మూడు సంవత్సరాలుగా దళితులపై వరుసగా దాడులకు పాల్పడేలా ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసిగొల్పుతున్నాడని ఈప్రభుత్వానికి ఒక్క క్షణంకూడా అధికారంలో ఉండడా నికి అవకాశంలేదని వెంటనే గద్దెదిగాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె నగేశ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ప్రెస్‌భవన్ లో పాత్రికేయుల సమావేశంలొ పార్టీనేతలు రాజన్న, పద్మతదితరులతోకలిసి మాట్లాడుతూ జిల్లాలోనే నేరెల్ల దళితులపై క్రూరంగా పోలీస్ లు జరిపిన థర్డ్‌డిగ్రీ ఘటనను మరిచిపోకముందే ఎల్లారెడ్డిపేటలో మదుకర్ మరణం మాసిపోకముందే అధికార పార్టీకి చెందిన నేతల అవి నీతి వల్ల దళిత యువకులు ప్రాణాలను కూడా కోల్పోయేందుకు వెనుకాడకుండా ఆత్మహత్యా యత్నం చేసిన వారికి అండగా నిలవాల్సి ఉందని, వారికి ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. భూపంపిణీ కార్యక్రమంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి బాద్యులైన మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, జడ్పీటిసి శరత్‌రావులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈఘటన మొత్తానికి బాద్యుడైన ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 3కోట్ల 40 లక్షలతో కొనుగోలుచేసిన భూమిపంపిణీ కిసంబందించిన జాబితాను బహిర్గతం చేయాలని అంతా అనర్హులను ఎంపిక చేసి రాజకీయం చేస్తూ ప్రజాప్రతినిధులు అవి నీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధులపైన ఎస్సీ ఎస్టీఅట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాక ఈసంఘటనను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం స్వయంగా మంత్రి దగ్గరుండి దొడ్డిదారిన బాదితు లను హైదరాబాద్ తరలిం చి ప్రతిపక్షాలను ఆసుపత్రికి రానీయకుండా చేసి తన నైజాన్ని చాటుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత పెద్ద సంఘటన జరిగితే మెజిస్టేట్ర్ చేత విచారణ జరుపకుండానే హైదరాబాద్ తరలించారని వారికి ఏమైనా హని జరిగితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.