దళితులు, మైనారిటీలపై దాడులు అభివృద్ధికి విఘాతం

వికృతచేష్టలను ఖండించిన రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ,ఆగస్టు 14(జనంసాక్షి):దళితులు, మైనారి టీలపై దాడులు జరుగకుండా కఠినంగా వ్యవరించాలని రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు.దేశ 70వ స్వాతంత్య్ర దినో త్సవం సందర్భంగా రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వాంతంత్య దినోత్సవ సందేశాన్ని ప్రణబ్ ఇవ్వడం ఇది ఐదోసారి. ఈ నాలుగేళ్లలో కొన్ని కలవరపరచే, విభజన, అసహన శక్తులు తలెత్తడం తన దృష్టికి వచ్చాయన్నారు. బలహీన వర్గాలపై హింసకు పాల్పడటమంటే జాతి ఆచార వ్యవహారాలు, నైతిక విలువలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ నుంచి జాతిని ఉద్దే శించి ఆదివారంనాడు ఆయన మాట్లాడారువిచక్షణతో కూడిన సమష్టి ఆలోచనా విధానంతో అలాంటి శక్తులను తిప్పికొ ట్టాలన్నారు. అప్పుడే దేశాభివృద్ధి అప్రతిహతంగా ముందుకు సాగుతుందన్నారు. మన ప్రజాస్వామ్య పరిపక్వతకు జీఎస్‌టీ రాజ్యాంగ సవర్ణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించడమే నిదర్శ నమని రాష్ట్రపతి పేర్కొన్నారు. ఆనందోత్సాహాల మధ్య ప్రజలు స్వాతంత్య్ర వేడుకలు జరుపుకోవాలని పిలుపుని చ్చారు.రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజాస్వామ్యం అంటే క్రమం తప్పకుండా ప్రభు త్వాన్ని ఎన్నుకోవడం కాదనిఆయన అన్నారు. ప్రజాస్వామ్యానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వమే పునాదులని పేర్కొన్నారు. మనలను మనం ఎప్పటికప్పుడు ప్రశ్నించుకుంటూ శాస్త్రీయ దృక్కోణం పెంచుకోవాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని పిలుపు నిచ్చారు.



