దళిత క్రైస్తవుల హక్కులను పరిరక్షించాలంటూ డిమాండ్
సికింద్రాబాద్, జనంసాక్షి: దళిత, క్రైస్తవ రాజ్యాధికార రాష్ట్ర సదస్సు శుక్రవారం సికింద్రాబాద్‌లోని హరిహర కళాభవన్‌లో జరిగింది. ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ దళిత, క్రైస్తవ సంఘాల నాయకులు, వివిధ చర్చిల ప్రతినిధులు పాల్గొన్నారు. కాన్సీరాం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రావిల కిషోర్‌బాబు ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా దళిత క్రైస్తవుల రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని, వారి ఆర్థిక రాజకీయ స్థితిగతులను మెరుగుపరచాలని ఆమోదించారు. రోమన్ కాథలిక్ వికార్ జనరల్ స్వర్ణబెర్నాడ్, మెథడిన్ట్ చర్చి బిషన్ గొల్లపల్లి జాన్, దళిత క్రైస్తవ రాజ్యాధికార సదస్సు నిర్వహణ కమిటీ కన్వీనర్లు ఫ్రాంక్లిన్ సుధాకర్, జోనాథన్ తదితరులు ఈ సదస్సులో పాల్గొన్నారు.