దళిత బాలికల అత్యాచారం హత్య పై నిరసన ,అంబేద్కర్ కు వినతి పత్రం
ఉరితీతకు సిపిఐ డిమాండ్
వనపర్తి సెప్టెంబర్ 16 (జనం సాక్షి)ఇద్దరు దళిత మైనర్ బాలికలపై అఘాయిత్యం, హత్య చేసిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లఖీంపూర్ ఖేరి జిల్లా లాల్ పూర్ ,మరో గ్రామానికి చెందిన ఆరుగురు దుండగులను ఉరితీయాలని పానగల్ మండలం వెంగళాయిపల్లి దళితులు డిమాండ్ చేశారు .సిపిఐ ఆధ్వర్యంలో గ్రామం బస్టాండ్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద వారు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు దళిత మహిళలు అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు దుండగులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.బిజెపి ప్రభుత్వం నశించాలని, పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కే శ్రీరామ్, సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి మల్లిపు బాలస్వామి, దళిత మహిళ నరసమ్మ మాట్లాడారు.బిజెపి ప్రభుత్వంలో దళితులకు,మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు బిజెపి పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లఖీంపూర్ ఖేరి జిల్లాలో జరిగిన తాజా సంఘటనే ఇందుకు తార్కాణమన్నారు. 17 ,15 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు దళిత బాలికలైన అక్క చెల్లెళ్లను తమను పెళ్లి చేసుకోవాలంటూ బాలికల సమీప గ్రామానికి చెందిన సోహైల్ ,జునైద్ అనే యువకులు వేధించేవారున్నారు.అందుకు వారు అంగీకరించలేద న్నారు మాట్లాడాలని చెరకు తోటకు తీసుకెళ్లి మరో ఇద్దరితో కలిసి వారు బాలికలపై అఘాయిత్యం చేశారన్నారు అనంతరం హఫీజుల్ తో కలిసి వారిని వారి చు న్నీలతోనే హత్య చేశారన్నారు దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు బాలికల శవాలను చెట్టుకు వేలాడ దీశారన్నారు .వీరే గాక ఈ నేరంలో చోటూ, రహమాన్,కరీముద్దీన్,ఆరిఫ్ లు పాలు పంచుకున్నారన్నారు.బుధవారం రోజు రాత్రి సంఘటన వెలుగు చూసిందన్నారు .చోటూ ఇంటి పక్కనే బాధిత బాలికలు ఉండేవారని, చోటూ ద్వారా జునైద్ ,సోహైల్ కు బాలికలతో పరిచయం ఏర్పడిందన్నారు. చోటూ మినహా మిగిలిన ఐదుగురు నిందితులు లాల్ పూర్ కు చెందినవారన్నారు ఈ ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారన్నారు .కానీ మహిళలు బాలికలపై అత్యాచారం హత్య చేసే నిందితులు శిక్షలు పడకుండా తప్పించుకోగలుగుతున్నారు. అందుకే నేరస్తుల్లో ప్రాణభయం ఉండటం లేదన్నారు. బిజెపి పాలిత రాష్ట్రం గుజరాత్లో మిల్కన్ భానో పై సామూహిక అత్యాచారం, ఆమె మూడేళ్ల కూతురు హత్య లో జీవిత ఖైదు పడ్డ నేరస్థులను క్షమాభిక్ష పేరుతో ఇటీవల వదిలి వేశారన్నారు నేరస్తులను మేళతాళాలతో పూలమాలాంకృతులను చేసి సన్మానించారన్నారు. ఇది నేర ప్రవృత్తిని ప్రోత్సహించే చర్యని విమర్శించారు తాజాగా ఉత్తరప్రదేశ్లో సంఘటన ఇటువంటి నేరాలకు ప్రేరణ కాగలదన్నారు. మహిళలను గౌరవించాలని నీతులు చెప్పే బిజెపి ఆచరణలో మహిళలను చిన్న చూపు చూస్తుందన్నారు ఈ వైఖరి మారకుంటే ప్రజాక్షేత్రంలో చావు తప్పద న్నారు ఈ కార్యక్రమంలో బాలమశమ్మ, నరసమ్మ, అనసూయమ్మ ,బురాన్ బి, రాములమ్మ ,దేవమ్మ సిపిఐ మండల కార్యదర్శి డంగు కుర్మయ్య నాయకులు మల్లెపు నరసింహ కురువ హనుమంతు చిన్న కురుమయ్య కురువ పెంటయ్య శివరాములు మా దారి రాములు బుచ్చయ్య చిగురు రాములు కృష్ణయ్య నరాల బాలస్వామి తిక్క రాములు కర్రి శేషన్న తదితరులు పాల్గొన్నారు
|