దళిత లిబరేషన్ ఫ్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్.

భారత్ బచావో సదస్సు విజయవంతం చేయండి.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 17. (జనంసాక్షి) భారత రాజ్యాంగ స్ఫూర్తి దిశగా పాలన జరగాలనే సంకల్పంతో జరగనున్న భారత్ బచావో మేధోమదన సదస్సును విజయవంతం చేయాల్సిందిగా దళిత విపరీషన్ ప్రంట్ నాయకులు మార్వాడి సుదర్శన్ కోరారు. గురువారం అంబేద్కర్ చౌరస్తా వద్ద సదస్సు కరపత్రాలను, దేశభక్తి ముసుగులో బుక్ లేట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మార్వాడి సుదర్శన్ తో పాటు నాయకులు మాట్లాడుతూ దేశంలో బిజెపి పాలనలోని మతోన్మాదనికి అడ్డుకట్ట వేసి భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నవంబర్ 19, 20 తేదీలలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న భారత్ బచావో మేధోమదన సదస్సును విజయవంతం చేసేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ నాయకులు రాగుల రాములు,సిపిఎం పార్టీ నాయకులు ఎర్రవెల్లి నాగరాజు, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు అకునురి బాలరాజు, ఆర్ పి ఐ నాయకులు రెడ్డిమల్ల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంగలి చంద్రమౌళి, రావణ్ శ్రీను,తదితరులు పాల్గొన్నారు.