దశాబ్దాల వివాదానికి తెరపడింది – కేంద్ర మంత్రి అమిత్‌షా

న్యూఢిల్లీ, నవంబర్‌9(జనం సాక్షి) : అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు
శనివారం వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నట్టు కేంద్ర ¬ంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. దశాబ్దాల తరబడి రగులుతున్న వివాదానికి ఈ తీర్పు ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. శ్రీరామ జన్మభూమిపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును స్వాగతిస్తున్నామని, ఒక్క భారత్‌, గొప్ప భారత్‌ నినాదానికి కట్టుబడి అన్ని మతాలు, వర్గాలు ఈ తీర్పును స్వాగించాలన్నారు. అందరూ శాంతి, సామరస్యాలను పాటించాలని, సుప్రీం నిర్ణయం దేశ సమైక్యత, సమగ్రత, సంస్కృతిని బలోపేతం చేయగలదని నమ్ముతున్నామని అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.