దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
;- తెలంగాణ ఇచ్చింది తెచ్చింది కాంగ్రెస్ పార్టీ
;– అసెంబ్లీ లో తెలంగాణ బిల్లు ను ప్రవేశ పెట్టిన ఘనత ;–శ్రీధర్ బాబుదే – కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ;–జనంసాక్షి, కమాన్ పూర్ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నందున, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ఖండిస్తూ ఏఐసీసీ కార్యదర్శి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమాన్ పూర్ లో “దశాబ్ది దగా” పేరుతో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమము చేపట్టాడం జరిగింది.ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి తహసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ గా వెళ్లి తాసిల్దార్ దత్తు ప్రసాద్ కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏవి కూడా అమలకు నోచుకోలేదు..ఏ రంగాల్లో కూడా ఇంతవరకు ఏమాత్రం అభివృద్ధి చెందకుండా ప్రజలందరిని మోసం చేస్తూ మరోసారి గద్దెనెక్కెందుకు దశాబ్ది ఉత్సవాల పేరుతో హంగామా హార్భాటాలు అధికార పార్టీ నాయకులు చేస్తున్నారని విమర్శించారు . మీరు ఎన్ని చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని 2014,2018 లో మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన హామీలు కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్య అమలు, ఫీజ్ రీయంబర్స్ మెంట్,ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమి, పోడు భూములకు పట్టాలు,రైతులకు రుణ మాఫీ,12 శాతం ముస్లిం రిజర్వేషన్లు,12 శాతం గిరిజన రిజర్వేషన్లు ఇలా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని కెసిఆర్ అమలు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రంగు సత్యనారాయణ గౌడ్, ఆకుల ఓదెలు, కటకం రవీందర్,గుమ్మడి సతీష్, తోగరీ అశోక్ ,సయ్యధ్ ఈక్బల్, బొంగోని సది,కోల నరేందర్,యాదగిరి రాజయ్య, నాగపూరి అజయ్, బత్తుల అంజి, మేకల లింగయ్య, శేకర్,పోతుల కుమార్, సాగి శ్రీధర్ రావు,ముస్తాక్,పెండ్యాల రాజు, చోప్పరి శేకర్, బద్రపు శంకర్,ఎర్రన్న, గుమ్మడి ప్రకాష్, అడ్వల చంద్రయ్య ,మిరాల రాజు, మెరుగు రవికిరణ్,కుక్క రవి,నగునురి నర్సయ్య, చాట్ల రాయమల్లు,యూసుఫ్ లల్లు, చింతపండు మధు,బొజ్జ సతీష్, ఈరుగురాల కుమార్, జక్కుల శ్రీనివాస్, మామిడి రాజు తదితరులు పాల్గొన్నారు.