దసరాకు ముస్తాబవుతున్న కోటమైసమ్మ ఆలయం

ఖమ్మం, అక్టోబర్‌ 19: జిల్లాలోని కారేపల్లి మండలంలో గల ఉసిరికాయల పల్లిలోని కోటమైసమ్మ ఆలయం దసరా జాతరకు ముస్తాబవుతుంది. ఖమ్మం, వరంగల్‌ జిల్లాలోని ప్రసిద్ధి చెందిన కోటమైసమ్మ ఆలయం వద్ద ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ మేరకు దేవాలయ పరిసరాలు జాతరకు సిద్ధం చేశారు. ఆలయంలోని వివిధ దేవతా మూర్తులను పట్టు పీతాంబరాలతో అలంకరిస్తున్నారు. ఆలయంలోని అమ్మవారికి దేవీనవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయ ఆవరణలో నూతనంగా శివలింగాన్ని, జ్ఞాన సరస్వతి విగ్రహాలు ప్రతిష్టించారు. సరస్వతి దేవీ విగ్రహాన్ని అర్వపల్లి రాధాకృష్ణ, రాంబాబులు బహూకరించారు. ఆలయంలోని పరమశివుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, సిద్ధి వినాయకుడికి రంగులద్ది ముస్తాబుచేశారు.