దసరా ఉత్సవాలకు పది ఎకరాల స్థలం కేటాయింపు 

 

– వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్

 

– కాశిబుగ్గ లో ఘనంగా దసరా వేడుకలు

 

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 06(జనం సాక్షి)

 

దసరా ఉత్సవాలకు పది ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు వరంగల్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నరేందర్ అన్నారు. బుధవారం రాత్రి వరంగల్ నగరంలోని చిన్న వడ్డిపల్లి చెరువు వద్ద కాశీబుగ్గ దసరా ఉత్సవ సంధ్య ఆధ్వర్యంలో ఘనంగా రావణ కార్యక్రమం దసరా ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి. వరంగల్ మేయర్   గుండు సుధారాణి . ఎమ్మెల్సీ బండా ప్రకాష్  హాజరయ్యారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్  మాట్లాడుతూ  కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి గత 35 సంవత్సరం నుంచి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు అన్నారు రావణాసుర వధ ప్రతిమను  తయారుచేసిన ఈ కార్యక్రమాలకు ముందుండి నడిపించిన గుళ్లపల్లి రాజకుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు. కాశిబుగ్గ ప్రాంతాన్ని ఇంకా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చినారు. ఉత్సవ సమితి అధ్యక్షులు దూపం సంపత్ గారు మాట్లాడుతూ 35 సంవత్సరాల కల నెరవేర్చినందుకు మాకు 10 ఎకరాలు స్థలం ఇస్తున్నందుకు మరియు చిన్న వడ్డేపల్లి  చెరువు బండ్ కు 4 కోట్ల రూపాయలు కేటాయించినందుకు వరంగల్ ఎమ్మెల్యే తూర్పు శాసనసభ్యులు నన్నపునేని  నరేందర్ గారికి  కాశిబుగ్గ ప్రాంత వాసుల తరఫున మరియు కాశిబుగ్గ దసరా ఉత్సవ సమితి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు.  అలాగే వరంగల్ జిల్లా కలెక్టర్ బి. గోపి కి వరంగల్ గ్రేటర్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య కి కాశిబుగ్గ దసరా  ఉత్సవాల సహకరించినందుకు వీరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు. “కూడా” అధికారులకు పోలీస్ సిబ్బందికి  మరియు మున్సిపల్ సిబ్బందికి అధికారులకు. కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు. మరియు ఎమ్మెల్యే గారిని ఘనంగా సన్మానించినారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ బయ్య స్వామి. ప్రధాన కార్యదర్శి సముద్రాల పరమేశ్వర్.20 డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్. 19 డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణ లత భాస్కర్.14 డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన సారయ్య. 18వ డివిజన్ కార్పొరేటర్ వస్కుల బాబు. 27 డివిజన్ కార్పొరేటర్ బాల్నే సురేష్. గుళ్లపల్లి రాజకుమార్.  ఓం ప్రకాష్ కొలారియా.గుత్తికొండ నవీన్. గోరంట్ల మనోహర్. దుబ్బ శ్రీనివాస్. చిలువేరు శ్రీనివాస్. సిద్ధూజు శ్రీనివాస్. వేముల నాగరాజు. మార్త ఆంజనేయులు. మార్టిన్ లూథర్. గుల్లపల్లి సాంబశివుడు.గణిపాక సుధాకర్. చిలువేరు థామస్.రాచర్ల శ్రీనివాస్. కత్తెర శాల కుమారస్వామి.క్యాతం రంజిత్. చిలువేరు పవన్. వలపదాసు గోపి.కోమటి కిషోర్.నూకలరాణి. ఎండి. ఇక్బాల్. క్యాతంరవీందర్. దేవర ప్రసాద్.ఊరుగొండ రవీందర్. మేకమల్ల వెంకటేష్. బొచ్చు మహేష్. కోటసతీష్. కట్కూరి సాయి. గంజి సాంబయ్య. మాటేటి అశోక్. కుసుమసారంగపాణి. రెడ్డి కిరణ్. ఉత్సవాలకు దాతలుగా సహకరించిన పెద్దలు మరియు కాశిబుగ్గ ప్రాంత ప్రజలందరూ పాల్గొన్నారు.