దసరా ఉత్సవాలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు

60 అడుగుల రావణ  ప్రతిమ తయారు
– కన్నుల పండుగ చేయనున్న బాణాసంచా
– విలేకరుల సమావేశంలో దసరా ఉత్సవ కమిటీ వెల్లడి
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 02(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ ఉరుసు రంగ లీలా మైదానంలో ఈనెల 3న నిర్వహించే సద్దుల బతుకమ్మతో పాటు 5 న నిర్వహించే విజయదశమి (దసరా) ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు దసరా ఉత్సవ కమిటీ అధ్యక్షులు నాగపూరి సంజయ్ బాబు తెలిపారు. ఈ మేరకు ఆదివారం కరీమాబాద్ ఆదర్శ ట్రస్ట్ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంజయ్ బాబు మాట్లాడుతూ సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలను గతంలో కంటే మరింత గొప్పగా నిర్వహించేందుకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ సహకారంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. 60 అడుగుల రావణ ప్రతిభ తయారు చేయించినట్లు చెప్పారు. రూపాయలు 20 లక్షల తో వివిధ రకాల బాణాసంచా కాల్చేందుకు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉచ్చవ స్థలంలో పారిశుద్ధ్యం  లైటింగ్, వాటర్, సదుపాయం, పార్కింగ్, వైద్య సౌకర్యాలను అలాగే పోలీస్ బందోబస్తును ఆయా శాఖల అధికారులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి మేడి మధుసూదన్ మాట్లాడుతూ ఉత్సవాలకు వరంగల్ తూర్పు ఎమ్మెల్యే అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరవుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా నగర మేయర్ గుండు సుధారాణి ఎంపీ దయాకర్ ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, బసవరాజ్ సారయ్య తోపాటు జిల్లా కలెక్టర్ గోపి ఆర్డిఓ మహేందర్ జి కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ స్థానిక కార్పొరేటర్లు హాజరవుతున్నట్లు చెప్పారు. ఉత్సవ కమిటీ కన్వీనర్  వడ్నాల నరేందర్ మాట్లాడుతూ ఉత్సవాలలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఈసారి మరింత గొప్పగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. శాస్త్రీయ సంగీతము, పేరుని నృత్యము, కోలాటం, జానపద నృత్యాలు మొదలైన అంశాలు ఇందులో ఉన్నట్లు చెప్పారు. ఉత్సవ కమిటీ ట్రస్ట్ చైర్మన్ వంగరి కోటేశ్వర్ మాట్లాడుతూ ఉత్సవ కమిటీ వద్ద 69 లక్షల ఇరవై వేల రూపాయలు నిల్వ ఉన్నట్లు చెప్పారు. ఈసారి ఉత్సవాల కోసం 18 లక్షల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ బాధ్యులు ఓగీలి శెట్టి  అనిల్ కుమార్, గోనె రాంప్రసాద్, వంచనగిరి సమ్మయ్య, మండ వెంకన్న, రంజిత్, అజయ్, సందీప్, చిరంజీవి, బొల్లం మధు, బొల్లం రాజు, వంశీ, అశోక్, వాసు, అఖిల్, వెంకటేశ్వర్లు, గోవర్ధన్, కృష్ణంరాజు, వినయ్, కత్తెరసాల వేణు తదితరులు పాల్గొన్నారు.
Attachments area