దసరా మేరు కులస్తుల బంధువుల ఆత్మీయ సమ్మేళనం

జగిత్యాల జిల్లా ప్రతినిధి

 

వివాహ పరిచయ వేదిక, మరియు సర్వసభ్య సమావేశం మేరు కుల బంధువులందరికీ నమస్కారములు మరియు పేరుపేరునా విజయదశమి దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ నెల అక్టోబర్ 9″వ తేదీ ఆదివారం ఉదయం 10″ గం” లకు మేర ఆత్మ గౌరవ భవనం, ఉప్పల్ బగాయత్, ఉప్పల్ హైదరాబాద్ లో నిర్వహిస్తున్న మేరు కుల బంధువుల దసరా ఆత్మీయ సమ్మేళనం, మరియు సర్వసభ్య సమావేశం మరియు వివాహపరిచయ వేదిక కార్యక్రమం, రాష్ట్ర మేరు సంఘం కమిటీ కార్యవర్గ సభ్యులు, మేర ఆత్మ గౌరవ భవనం ట్రస్ట్ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు, నిర్వహిస్తున్న ఈ దసరా సమ్మేళనం కార్యక్రమానికి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేరు కులస్థులను, జిల్లాల, జోన్ల, కమిటీ సభ్యులను, కులస్థులను, మహిళా,& యువజన కమిటీలను ముఖ్యమైన మన కులపెద్దలను ఆహ్వానించడం జరుగుతున్నది, ముఖ్య అతిథులుగా అధికార పార్టీ రాజకీయ నాయకులను, మరియు అన్ని కుల సంఘాల పెద్దలను, ఈ సమ్మేళన కార్యక్రమానికి ఆహ్వానించడం జరుగుతున్నది.ముఖ్యంగా ఈ దసరా సమ్మేళనం అనేది మనమందరం కులస్తులం కుటుంబ సమేతంగా ఆత్మీయతతో ఒకచోట కలవడానికి, ప్రేమ ఆప్యాయతతో ఒకరినొకరు గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడానికి, మన ఐకమత్యం కులస్థుల సంఖ్యాబలం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే దిశగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది,కులవృతిపై ఆధారపడి జీవిస్తున్న మన కులస్తులకు రావలిసిన వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి, వివిధ రాజకీయ నాయకులను వేదికపైకి ఆహ్వానించి వారికీ వివరించి వినతి పత్రం సమర్పించుట కొరకు రాష్ట్ర కమిటీ కృషి చేయడం జరుగుతున్నది,
మరియు మన కోరిక మేరకు సెంట్రల్ బ్యాంక్ వారు బిజినెస్ చేసుకునే వారికి 50,000 నుంచి 5 లక్షల వరకు పర్సనల్ లోన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు, లోన్ కావలసినవారు ఒక ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ ఒరిజినల్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వెంట తీసుకు రాగలరు, మరియు టాటా, బజాజ్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్లు కూడా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.మన కులస్థుల అందరి కొరకు ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమ్మేళనం కనుక, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి (మన మధ్యలో ఉన్న తార తమ్యాలు విమర్శలు, అపోహలను పక్కన పెట్టిన, రాజకీయ నాయకుల ముందు ఇతర కుల సంఘాల పెద్దల ముందు మన మంతా ఒక్కటే అనే నినాదంతో ముందుకు వచ్చి) మీ మీ పూర్తి సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమం దిగ్విజయవంతం చేయాలనీ, మేరుకుల ఐక్యతను కోరుకునే మేరుకుల బంధువులు అభిమానులు, ప్రతి ఒక్కరూ ముఖ్యంగా యువత ముందుకు వచ్చి తమవంతు బాధ్యతగా భావించి మీపూర్తి సహాయ సహకారాలు అందించి ఈ దసరా సమ్మేళనం, సర్వసభ్య సమావేశం, విజయవంతం చేయగలరు.