దసరా సెలవులకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఆదిలాబాద్,అక్టోబర్2(జనంసాక్షి): దసరా సెలవులను పురస్కరించుకొని గతేడాది మాదిరిగానే ఆర్టీసీ సంస్థ ఆదిలాబాద్ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ శంకర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు వచ్చే విద్యార్థుల సౌకర్యార్థం ఈఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. దసరా సెలవుల నేపథ్యంలో ఈనెల 9వ తేదీన ప్రత్యేక బస్సుసేవలు అందిస్తున్నామన్నారు. జేబీఎస్, మియాపూర్, కూకట్‌పల్లి నుంచి రిజర్వేషన్ సౌకర్యంతో ప్రత్యేక బస్సులు సేవలందిస్తాయన్నారు. ముందస్తు రిజర్వేషన్ కోసం వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. హైదరాబాద్‌లోనిమిగితా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల కొరకు జిల్లా కేంద్రంలోని బస్ రిజర్వేషన్ కేంద్రాన్ని సంప్రదించాలని అన్నారు. పూర్తి వివరాలకు రిజర్వేషన్ కౌంటర్ ఇన్‌ఛార్జిని సంప్రదించాలని సూచించారు. ఆర్టీసీ సంస్థ అందిస్తోన్న ఈసౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.