దాడుల వెనుక ఐఎప్‌ఐ పాత్ర
– డేవిడ్ హెడ్లీ
ముంబై,ఫిబ్రవరి 8(జనంసాక్షి): జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) జరిపిన విచారణలో డేవిడ్ పలు కీలక విషయాలను వెల్లడించారు. ముంబై దాడుల వెనుక ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా హస్తం ఉందని తేల్చిచెప్పారు. డేవిడ్ హెడ్లీ ప్రస్తుతం అమెరికా జైలులో ఉన్నారు. అయితే ముంబై దాడులకు లష్కరే తోయిబా కమాండర్ లఖ్వీ పథక రచన చేయగా, అతడికి పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ సహకరించిందని తెలిపారు. ముంబై దాడుల కేసులో లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ అఫ్రూవర్‌గా మారారు. ముంబై కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డేవిడ్‌ను న్యాయస్థానం విచారిస్తుంది. ముంబై దాడుల తర్వాత 2009లో ఒకసారి భారత్‌కు వచ్చానని లష్కరే తోయిబా ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ పేర్కొన్నారు. భారత్‌లో మొత్తం 8 సార్లు పర్యటించానని పేర్కొన్నాడు. పాకిస్థాన్ నుంచి 7 సార్లు, యూఏఈ నుంచి ఒకసారి భారత్‌కు వచ్చాను అని తెలిపాడు. లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ విూర్ భారత్‌కు వచ్చేందుకు సాయం చేశాడు. భారత్‌కు వచ్చేందుకే పేరును దావూద్ గిలానీకి బదులు డేవిడ్ హెడ్లీగా మార్చుకున్నానని చెప్పారు. దాడుల కంటే ముందే ఐఎస్‌ఐ చీఫ్ సుజా పాషా లఖ్వీని నేరుగా కలిశారని స్పష్టం చేశాడు. హస్తినలోని భారత ఉప రాష్ట్రపతి నివాసం, ఇండియా గేట్, సీబీఐ కార్యాలయాలపైనా కూడా రెక్కీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ రెక్కీ కోసం తనకు ఐఎస్‌ఐ డబ్బు ముట్టజెప్పిందని పేర్కొన్నాడు. ముంబై దాడుల కేసులో 35 ఏళ్ల జైలు శిక్షను డేవిడ్‌కు కోర్టు విధించింది.2006లో తన పేరును దావూద్ గిలానీకి బదులుగా డేవిడ్ హెడ్లీగా మార్చుకున్నట్లు చెప్పాడు. తనను క్షమిస్తే అప్రూవర్‌గా మారతానని గతేడాది డిసెంబర్ 10న భారత న్యాయస్థానాన్ని హెడ్లీ కోరాడు. దీనికి ప్రత్యేక న్యాయమూర్తి సనాప్ కొన్ని షరతులపై అంగీకరించారు. ప్రస్తుతం హెడ్లీ అమెరికా న్యాయస్థానంలో 35ఏళ్ల కారాగార శిక్ష అనుభవిస్తున్నాడు.