దాతల సహాయంతోనే గ్రంధాలయాలు అభివృద్ధి

– సర్పంచ్ పొట్ట విజయ కిరణ్
కోదాడ టౌన్ జూలై 26 ( జనంసాక్షి )
దాతల సహాయంతోనే గ్రంథాలయాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని గణపవరం గ్రామ సర్పంచ్ పొట్ట విజయ కిరణ్, గ్రంథాలయ అధ్యక్షులు వట్టికూటి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మండల పరిధిలోని గణపవరం గ్రామంలో ని గ్రంథాలయానికి కోదాడకు చెందిన భారత్ పబ్లిక్ స్కూల్ నిర్వాహకుడు మంత్రి పగడ శ్రీధర్ రావు వివిధ జాతీయ నాయకులు, చరిత్రకారుల కు సంబంధించిన 250 పుస్తకాలను బహుమానంగా అందజేశారు.ఈ సందర్భంగా పుస్తకాలను అందించిన శ్రీధర్ తో పాటు గ్రంథాలయానికి పూర్వ వైభోగం తీసుకువచ్చి గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రంధాలయ అధ్యక్షులు వెంకటేశ్వర్ల కు పలువురు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బత్తుల కోటయ్య,గ్రామశాఖ అధ్యక్షులు ముడియాల వెంకటరెడ్డి,నల్లాని రామారావు,పోశం బసవయ్య,కత్తి గాంధీ,ఈర్ల నిర్సరెడ్డి తదితరులు పాల్గొన్నారు.