దాద్రి ఘటన దురుదృష్టకరం

4

– భారతీయతను దెబ్బతీయోద్దు

– స్పందించిన రాష్ట్రపతి

న్యూఢిల్లీ,అక్టోబర్‌7(జనంసాక్షి):

భారతీయ నాగరికత, నైతిక విలువలను దిగజార్చనీయవద్దని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత్‌ సకల మతాల సమ్మేళనమని దీని ప్రతిష్టకు భంగం వాటిల్లరాదన్నారు. సెప్టెంబర్‌ 28న ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సవిూప గ్రామమైన బిసాడా గ్రామంలో గోవును వధించి దాని మాంసం తిన్నారన్న వదంతులతో 55 ఏళ్ల మహ్మద్‌ అక్లాఖ్‌ కుటుంబంపై సుమారు 200 మంది స్థానికులు దాడి చేసి ఆయనను రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు పది మందిని యూపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ దారుణ ఘటనపై రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జి బుధవారం స్పందించారు.బుధవారం రాష్ట్రపతి భవన్‌ లో జరిగిన ది నేషనలిస్ట్‌ ప్రసిడెంట్‌ ప్రణబ్‌ ముఖర్జీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. వైవిధ్యం, సహనం భారత దేశానికి మూల విలువలని, ఏ ఒక్కరు కూడా వీటిని దిగజార్చేలేలా ప్రవర్తించవద్దని ఆయన హితవుపలికారు. పరమత సహనం మనవిధానమని మరచిపోరాదన్నారు. మూల విలువలు ఉన్న సమాజంలో ఇలాంటి సంఘటనలకు చోటు లేదన్నారు.సహనంతో ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.  పురాతన నాగరికతల్లో శతృత్వ ధోరణిలు ప్రబలి అంతరించినా.. విలువలు మాత్రం ఇంకా నిలిచే ఉన్నాయని అందుకు కారణం మూల విలువలేనని ఆయన స్పష్టం చేశారు.వాటిని మదిలో భద్రపరుచుకుని ప్రజాస్వామ్య దేశంలో మసులు కోవాలని సూచించారు. దాద్రి సంఘటన నేపథ్యంలో ఈ అంశంపై దాదాపు 15 నిమిషాల పాటు ప్రణబ్‌ అనర్గళంగా ప్రసంగించారు.నాగరికతతో వ్యవహరించాలని ప్రణబ్‌ సూచించారు.  భారత్‌ లో చాలా ఏళ్ల నుంచి నాగరికత, భిన్నత్వంలో ఏకత్వం వర్ధిల్లుతోందన్నారు. వాటిని గౌరవిస్తూ ప్రతి ఒక్కరు ప్రవర్తించాలని రాష్ట్రపతి ప్రణబ్‌ సూచించారు. వైవిధ్యం, సహనం భారత దేశానికి మూల విలువలని, వాటిని దిగజార్చేలా ప్రవర్తించవద్దని హితవు పలికారు.ప్రభు చావ్లా ఎడిట్‌ చేసిన ఈ పుస్తకం మొదటి కాపీని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి అందించారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.