దాద్రి బాధిత కుటుంబానికి రాహుల్‌ భరోసా

4

– పరామర్శించిన కేజ్రీవాల్‌

దాద్రి, అక్టోబర్‌3(జనంసాక్షి):

ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి సవిూప గ్రామంలో ఇటీవల జరిగిన దారుణాన్ని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఖండించారు. మత విద్వేషాలు ప్రోత్సహించవద్దని హితవుపలికారు. శనివారం ఆ గ్రామాన్ని సందర్శించిన ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడాలని పోలీసులకు సూచించారు. గోవును వధించి మాంసాన్ని తిన్నారన్న అనుమానంతో సుమారు వంద మంది స్థానికులు సోమవారం రాత్రి ఓ ముస్లిం ఇంటిపై దాడి చేశారు. 50 ఏళ్ల మహ్మద్‌ అక్లాఖ్‌ను రాళ్లతో కొట్టి హత్య చేశారు. ఈ దారుణం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రెండో కుమారుడు కోలుకుంటున్నాడు. ఈ కేసుకు సంబంధించి యూపీ పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. దీంతో అరెస్టైన వారి సంఖ్య పదికి చేరింది. మరోవైపు హత్యకు గురైన మహ్మద్‌ అక్లాఖ్‌ పెద్ద కుమారుడు మహ్మద్‌ సర్తాజ్‌ భారత వైమానిక దళంలో ఎయిర్‌మ్యాన్‌గా పని చేస్తున్నాడు. దీంతో ఐఏఎఫ్‌ చీఫ్‌ అరుప్‌ రాహ్‌ బాధిత కుటుంబానికి తన సంతాపం తెలిపారు. ఎయిర్స్‌ఫోర్స్‌ క్వాటర్స్‌లో ఆ కుటుంబానికి ఆశ్రయం కల్పిస్తామని, వారికి అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. మరోవైపు ఈ విషయాన్ని రాజకీయం చేయవద్దని సర్తాజ్‌ యూపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజకీయ నేతలు తమ కుటుంబాన్ని కలిసేందుకు అనుమతించవద్దని ఆయన కోరారు. అయినప్పటికీ పలువురు ప్రముఖులు బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆ ఇంటికి క్యూ కడుతున్నారు.

దద్రీ బాధితులకు కేజ్రీవాల్‌ పరామర్శ

యూపీలోని దద్రీ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆప్‌ నేతలతో కలిసి బాధిత కుటుంబాలను కలిశారు. ఈ ఘటన వల్ల ఏ ఒక్క మతానికి లాభం చేకూరలేదని, కేవలం పార్టీలు, రాజకీయ నాయకులు మాత్రమే లాభపడ్డారని కేజ్రీవాల్‌ అన్నారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామని కేజ్రీవాల్‌ హావిూ ఇచ్చారు. అంతకు ముందు బాధిత కుటుంబాలను కలిసేందుకు వచ్చిన కేజ్రీవాల్‌ ను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

సీఎంను అడ్డుకున్న గ్రామస్తులు

యూపీతో పాటు దేశవ్యాప్తంగా చిచ్చురేపిన దాద్రి ఘటన రేపిన దుమారం రోజురోజుకు ముదురుతోంది. శనివారం గ్రామానికి వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ను తమ గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ గ్రామస్తులు అడ్డుకున్నారు. ఒక్క కేజ్రీవాల్‌ మాత్రమే కాదు.. తమ గ్రామంలోకి విూడియా కూడా ప్రవేశించడానికి వీల్లేదంటూ తెగేసి చెబుతున్నారు. గోమాంసం తిన్నారనే ఆరోపణతో ఉత్తరప్రదేశ్‌లో బిషాదా గ్రామంలో ఇఖ్లాక్‌ అనే వ్యక్తిని కొంతమంది గ్రామస్తులు సామూహికంగా దాడిచేసి కొట్టి చంపారు. స్థానిక బీజేపీ నేత కొడుకు ఈ ఘటనకు పురిగొల్పాడనే వార్తలు విూడియాలో గుప్పుమన్నాయి.అటు విపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ముందస్తు ప్రణాళికతోనే చేసిన హత్య అని ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తదితరులు కూడా ఆ ఘటనపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపిస్తామని కేంద్రం అంటోంది.మరోవైపు ఈ ఘటనలో హత్యకు గురైన డానిష్‌ కుటుంబ సభ్యులు తమను ప్రశాంతంగా  జీవించనివ్వండంటూడని  విూడియాను, ప్రజలను కోరారు. జరిగిన ఘోరాన్ని, తాము చెప్పాల్సిన విషయాలను ఇప్పటికే  అందరికీడని  తెలిపామంటోంది. కాగా ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.