దానం సమక్షంలో గలాటా
హైదరాబాద్,డిసెంబర్19(జనంసాక్షి): బంజారాహిల్స్‌లోని వెంకటేశ్వరనగర్‌లో నిర్వహించిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ కవితారెడ్డికి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. తెరాసకు చెందని వారు ఇక్కెడికెందుకు వచ్చారంటూ నిలదీసారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ రసాభాస ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే జరిగింది. ఇరువర్గాలకు ఎమ్మెల్యే దానం నచ్చజేప్పే ప్రయత్నం చేశారు. కార్పొరేటర్ కవితారెడ్డి భర్త గోవర్దన్ రెడ్డి బీఎస్పీ తరఫున పోటీ చేశారని, తెరాసకు చెందని వారు ఇక్కడికి రావొద్దంటూ స్థానికులు నినాదాలు చేశారు. దీంతో కార్పొరేటర్ కవితా రెడ్డి ఈ విషయాన్ని కేటీఆర్‌కు వివరిస్తానంటూ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లినట్టు సమాచారం.