దావూద్ పాక్‌లోనే ఉన్నాడు
– ఇండియాకు రప్పించి తీరుతాం
న్యూఢిల్లీ,మే 11 (జనంసాక్షి):
ముంబై పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఎక్కడున్నాడో తెలియదన్న కేంద్రం ఇప్పుడు అతను పాక్‌లోనే తలదాచుకున్నట్లు తేల్చింది. ఈ మేరకు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో ఓ ప్రకటన కూడా చేశారు. దావూద్‌ను ఇండియాకు రప్పించి తీరతామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించి కేంద్రమంత్రి సోమవారం పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేశారు. దావూద్ పాకిస్తాన్‌లో ఉన్నట్టు తమకు విశ్వసనీయ సమాచారం ఉందన్నారు. అతడిని ఇండియాకు అప్పగించాలనే విషయంపై పాక్‌పై ఒత్తిడి తీసుకురానున్నట్టు తెలిపారు. ఇక ఈ వివాదానికి తొందరలోనే ముగింపు పలుకుతామని స్పష్టం చేశారు.కాగా గతంలో లోక్‌సభలో దావూద్ ఎక్కడున్నాడో ప్రభుత్వానికి ఇంతవరకూ తెలియదు. అతని ఆచూకీ తెలుసుకున్న తర్వాత అప్పగింత పక్రియ మొదలవుతుంది’ అన్న ¬ం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌధురి ప్రకటన దుమారం రేపింది. నిత్యానంద్ రాయ్ అనే సభ్యుడి ప్రశ్నకు మంత్రి రాతపూర్వక సమాధానం ఇచ్చారు. దావూద్‌పై రెడ్ కార్నర్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నోటీసులున్నాయి. దావూద్ పాక్‌లో ఆ దేశ భద్రతా బలగాల అండతో తలదాచుకుంటున్నాడని భారత ప్రభుత్వం పలు వివరాలను పాక్‌కు అందించడం, అతన్ని తమకు అప్పగించాలని ¬ం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత ఏడాది డిమాండ్ చేశారు. దీనికి భిన్నంగా హరిభాయ్ ప్రకటన.. ప్రతిపక్షాల ఆందోళనతో ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లయింది. ఈ నేపథ్యంలోనే లోక్‌సభలో సర్కారు స్పష్టమైన వివరణ ఇచ్చింది. మాఫీయా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నట్టు తమ వద్ద సమాచారం ఉందని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ స్పష్టం చేశారు. దావూద్‌కు సంబంధించిన అన్ని వివరాలు పాక్ వద్దే ఉన్నాయని, కానీ దావూద్‌ను పట్టుకోవడంలో ఆ దేశం విఫలమవుతోందిన తెలిపారు. దావూద్ ఇబ్రహీంను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దావూద్‌ను భారత్‌కు రప్పిస్తామని స్పష్టం చేశారు.