దిగజారి ప్రవర్తిస్తున్న టిడిపి నేతలు

వారికి గవర్నర్‌ అంటే గౌరవం లేదు: శ్రీకాంత్‌ రెడ్డి
అమరావతి,మార్చి7(జనం సాక్షి): రైతుల ముసుగులో టీడీపీ డ్రామాలు ఆడుతోందని, ప్రజా సమస్యలపై టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ది లేదని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. టీడీపీ నేతలు రోజురోజుకీ దిగజారి ప్రవర్తిస్తున్నారు. బీఏసీ లో అచ్చెన్నాయుడు వ్యవహారశైలి చూశాం. వారు సభని కొనసాగించ కూడదన్నట్టే ఉన్నారు. సభను, వ్యవస్థలను అగౌరవపరచవద్దని టీడీపీ వారికి చెప్తున్నాం అని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఏపీ బ్జడెట్‌ సమావేశాల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించిన వేళ.. సభలో టీడీపీ వ్యవహరించిన తీరు విమర్శలకు దారి తీసింది. గవర్నర్‌ను అగౌరవపర్చేలా టీడీపీ వ్యవహరించింది. ఈ వ్యవహారంపైశ్రీకాంత్‌రెడ్డి ఏపీ శాసనసభ ప్రాంగణం విూడియా పాయింట్‌ నుంచి మాట్లాడారు. ప్రజాస్వామ్యంపై టీడీపీకి ఏమాత్రం గౌరవం లేదని ఈ ఘటనతో రుజువైందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. గవర్నర్‌ అంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు కదా!. ఆయన వయసును కూడా
చూడకుండా వ్యవహరించారు. అసలు ప్రసంగ పత్రాల్లో ఏముందో కూడా వారు చూడకుండా చించేశారు. గవర్నర్‌ పై దాడి అంటే ఒక వ్యవస్థ పై దాడి చేసినట్టే!. ప్రతిపక్ష నేతగా జగన్‌ ఆనాడు ఎంతోహుందాగా వ్యవహరించారు. ఇప్పుడు టీడీపీ ఆ పని చేయట్లేదు. సంస్కార హీనులుగా వ్యవహరించడం టీడీపీ నేతలకు ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.