దిల్లీ సర్కారుపై మా పెత్తనం లేదు
రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ,మే29(జనంసాక్షి):
దిల్లీ సర్కారుపై కేంద్రం పెత్తనం చెలాయించట్లేదని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీ ప్రభుత్వాన్ని తామే నడపాలనే ఉద్దేశ్యం తమకు లేదని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని ఆ పార్టే నడుపుకోవచ్చని తెలిపారు. కేవలం కొన్ని రాజ్యాంగపరమైన నియమాలను మాత్రమే అమలు చేయాలనుకుంటున్నామని తెలిపారు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు రాజ్యాంగం అధికారుల బదిలీ, సీనియర్ అధికారుల నియామకంకు సంబంధించిన కొన్ని అధికారాలను ప్రసాదించిందని వివరించారు. తమ ప్రభుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని తెలిపారు. రాజ్యాంగ నియామాలను పాటించాల్సిన బాధ్యత కూడా కేంద్రంపై ఉందని తెలిపారు. కాగా, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో లెఫ్టినెంట్ గవర్నర్, సీఎం కేజీవ్రాల్ మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.