దివంగత నేత గద్దెన తొమ్మిదో వర్ధంతి

భైంసా, జనంసాక్షి: కాంగ్రెస్‌ నేత గద్దెన సేవలు మరవలేనివని స్థానిక కాంగ్రెస్‌ నేతలు కొనియాడారు. గద్దెన తొమ్మిదో వర్ధంతిని పట్టణంలోని గద్దెన నిలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ మురళీధర్‌ తదితరులు పాల్గొన్నారు.