దివంగత రాజీవ్‌కు ఘననివాళి

4

 

4A copy
న్యూఢిల్లీ,మే21(జనంసాక్షి): మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ,  ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ,కూతురు ప్రియాంక వాద్రా తదితరులు  ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఉదయం రాజీవ్‌ గాంధీ సమాధి వీరభూమి వద్దకు వారు చేరుకుని ఘన నివాళులర్పించారు. వారితో పాటు సోనియా కుమార్తె ప్రియాంక, అల్లుడు రాబర్ట్‌ వాద్రాలు  పుష్పగుచ్చాలు ఉంచి అంజలి ఘటించారు. పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలతోపాటు అజయ్‌ మాకెన్‌, పీసీ చాకో, గాంధీ కుటుంబసభ్యులు రాజీవ్‌కు  నివాళులర్పించిన వారిలో ఉన్నారు.  మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా నివాళి అర్పించిన వారిలో ఉన్నారు. భారత మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్థంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆయనకు నివాళులర్పించారు. వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రధాని తన ట్విట్టర్‌ ద్వారా నివాళులు అర్పించారు. 1991 సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో ఉండగా ఎల్టీటీఈ ఉగ్రవాదులు చేసిన ఆత్మాహుతి దాడిలో శ్రీపెరంబుదూరు వద్ద మానవబాంబు దాడిలో రాజీవ్‌  మరణించారు. రాజీవ్‌ గాంధీ 1984 అక్టోబర్‌ 31 నుంచి 1989 డిసెంబర్‌ 2వ తేదీ వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు.