దివ్య జన్మదినం సందర్భంగా విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేత
పినపాక నియోజకవర్గం సెప్టెంబర్ 28 (జనం సాక్షి): మణుగూరు మండలం లోని పి వి కాలనీకి చెందిన సింగరేణి విశ్రాంత ఉద్యోగి పాపారావు కుమార్తె దివ్య జన్మదిన వేడుకల సందర్భంగా కొత్త కొండాపురంలోని సింగరేణి సేవా సమితి ట్యూషన్ సెంటర్ విద్యార్థినీ విద్యార్థులకు దివ్య చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా పాపారావు మాట్లాడుతూ మనిషి పురోగతి సాధించాలంటే ఉన్న ఏకైక సక్రమ మార్గం విద్య ఒకటేనని తద్వారా సంపాదించుకున్న జ్ఞానంతో ఉన్నత స్థాయికి ఎదగవచ్చని ఆయన అన్నారు.ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్యం కోసం పని చేస్తారు.ఆ దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు.మన మనస్సు సంతృప్తి చెందలంటే ఒకటి దైవ కార్యమైనా చేయాలి లేదా సేవా కార్యక్రమైలైనా నిర్వహించాలి.నాకు తెలిసి సేవా మార్గం ఉత్తమం అప్పుడే మనిష జీవితానికి ఒక సార్ధకత ఉంటుందని అన్నారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులకు గ్రామస్తులకు స్వీట్లు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సింగరేణి సేవా సమితి సభ్యులు ఎస్ డి నా సర్ పాషా, విద్యా వాలంటీర్ బంగారి సంధ్య, శ్రీకాంత్ అంగన్వాడి టీచర్ వెంకటమ్మ, సత్యవతి, చుక్కమ్మ, ప్రమీల, వీరమ్మ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.