దీపావళి వేడుకల్లో పాల్గొన్న కెనడా ప్రధాని
ఒట్టావో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడియో దీపావళి సంబరాల్లో పాల్గొన్నారు. ఒట్టావోలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సోమవారం రాత్రి దివాళీ వేడుకలు ఘనంగా జరిగాయి. జ్యోతి ప్రజ్వలన ద్వారా కెనడా ప్రధాని దీపావళి సంబరాలను ప్రారంభించారు. భారతీయ సంతతి ప్రజలు ఈ వేడుకలకు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఇండియన్ హై కమీషనర్ వికాశ్ స్వరూప్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీపం ఉన్న కెనడాపోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కెనడా మంత్రులు కూడా పాల్గోన్నారు. భారతీయ సంతతి ప్రజలకు కెనడా ప్రధాని దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఇండియన్ కమ్యూనిటీ చాలా వైబ్రంట్‌గా ఉందన్నారు.