దుకాణంలో అగ్ని ప్రమాదం
నిర్మల్‌పట్టణం: పట్టణంలోని సునార్ గల్లీలో ఉన్న శ్రీ ఇన్వర్టర్ దుకాణంలో ఈతెల్ల వారుజామున విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆస్తినష్టం సంభవించినట్లు బాధితుడు శ్రీనివాస్ పేర్కొన్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు .



