దుబ్బాక రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలి.
ఎం.పి .ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
– దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు.
దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం అద్యక్షుడు మాడబోయిన శ్రీకాంత్.
దుబ్బాక 28, జూన్ ( జనం సాక్షి )
దుబ్బాక నియోజకవర్గం వైద్యం, విద్య వంటి అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే నియోజకవర్గంలో డివిజన్ స్థాయి కార్యాలయాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయించాలని ఇప్పటికే మెదక్ ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి , దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ రావు కు పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కాని దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుండి ఎటువంటి ముందడుగు పడకపోవడం బాధాకరం. జిల్లాల పునర్విభజన సమయంలో మూడవ రెవెన్యూ డివిజన్ గా దుబ్బాక ఏర్పాటు కావలసింది. కాని దుబ్బాక ప్రజలు ఐక్యంగా అడగకపోవడం వల్ల మన అవకాశాన్ని ఇతర జిల్లా నుండి కేవలం రెండు మండలాలతో విలీనం అయిన వేరే ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ కార్యాలయాన్ని అక్రమము గా తరలించారు. ఇప్పటికైనా నియోజకవర్గ కేంద్రం, సబ్ డివిజన్ కేంద్రం అయిన దుబ్బాక ను రెవెన్యూ డివిజన్ గా ప్రకటించాలని దుబ్బాక రెవెన్యూ డివిజన్ సాధన సమితి, దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం తరపున ప్రభుత్వాన్ని కోరుతున్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దుబ్బాక ప్రాంతం ఎంతో ఇష్టమైనది అంటారు. కావున ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి , ఎమ్మెల్యే రఘునందన్ రావు, కేసిఆర్ దుబ్బాక రెవెన్యూ డివిజన్ ప్రకటన చేయించాలని దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం తరపున కోరుతున్నారు. మంగళవారం రోజున దుబ్బాక రెవెన్యూ డివిజన్ ఆవశ్యకత పై, రెవెన్యూ డివిజన్ వలన కలిగే లాభాలపై ప్రజలకు అవగాహన కోసం కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో దుబ్బాక డెవలప్మెంట్ ఫోరం అద్యక్షుడు మాడబోయిన శ్రీకాంత్, ఉపాధ్యక్షుడు మర్గల రాజేష్, పద్మశాలి యువజన సంఘము అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area
|