దుమ్ముగూడెంకు 21.66కోట్లు మంజూరు
ఖమ్మం, ఫిబ్రవరి 2 (): ఖమ్మం జిల్లాలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న దుమ్ముగూడెంప్రాజెక్టుకు (రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్, నాగార్జున్ సాగర్ టైల్ పాండ్) కు ప్రభుత్వం తాజాగా రూ. 21.66కోట్లు మంజూరు చేసింది. బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ. 120.11కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ. 98.45కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మిగతా 21.66 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో దుమ్ముగూడెం ప్రాజెక్టుకు సంబంధించిన పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి.