దుమ్ముగూడెం నిర్వహణకు రూ.79 కోట్లు విడుదల
ఖమ్మం, జూలై 30 : ఖమ్మం జిల్లాలో నిర్మించతలపెట్టిన దుమ్ముగూడెం ప్రాజెక్టు టెయిల్ పాండ్ నిర్మాణానికి రూ. 79 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు జీఓ నంబర్ 452, 453, 463లను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టులో తాత్కాలిక ప్రతిపాదికన పనిచేస్తున్న 280 మంది ఉద్యోగులను 2013 ఫిబ్రవరి వరకు కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని కూసుమంచి నుంచి బీరోలు వరకు రోడ్డు నిర్మాణానికి గాను రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు.