దూరవిద్య బిఇడికి ఓయూ అనుమతి
ఫిబ్రవరి 15వ తేదీలోపు రిజిస్టేష్రన్
హైదరాబాద్,జనవరి24(జనంసాక్షి): ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య విధానంలో 2018-19 విద్యా సంవత్సరానికి బీఈడీ అడ్మిషన్ల పక్రియ మొదలైంది. ఇప్పటి వరకు దీనిని నిలిపి వేయగా మళ్లీ అడ్మిషన్లు తీసుకునేలా చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, నిజామాబా ద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని పది స్టడీ సెంటర్లలో ఒక్కో కేంద్రానికి 50 సీట్ల చొప్పున మొత్తం 500 సీట్లను కేటాయించ నున్నారు. దూరవిద్య బీఈడీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో 110 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు.. ముందుగా ఫిబ్రవరి 15వ తేదీలోపు రిజిస్టేష్రన్ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.200 ఆలస్యరుసుంతో ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయా కేంద్రాల్లోని రోస్టర్ ఆధారంగా ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం సీట్లు కేటాయిస్తారు. దూరవిద్య విధానంలో బీఈడీ సీట్లకు సంబంధించి ఉన్న మెథడాలజీల ప్రకారం కోటాను నిర్దేశించారు. సాధారణంగా దూరవిద్య విధానంలో ఏ కోర్సుచదువాలనుకున్నా.. దేశంలోని ఏ ప్రాంతంవారైనా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. కానీ, ఒక్క దూరవిద్య బీఈడీ లో మాత్రం తెలంగాణలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకే అవకాశం ఉంది. 2014 వరకు కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో దూరవిద్య బీఈడీ కొనసాగింది. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో బీఈడీని ఎన్సీటీఈ రద్దు చేసింది. దూరవిద్య విధానం ఆధ్వర్యంలోనే దూరవిద్య కోర్సులను నిర్వహించాలని తేల్చిచెప్పింది. ఓయూ దూరవిద్య విభాగం డైరెక్టర్ చింతా గణెళిశ్ పత్యేక్ర ఆసక్తితో ఎన్సీటీఈ అధికారులను వర్సిటీకి రప్పించి.. తీవ్ర ప్రయత్నాల అనంతరం తిరిగి 2018-19లో దూరవిద్యలో బీఈడీని ప్రవేశపెట్టేందుకు అనుమతినిచ్చింది.