దూసుకొస్తున్న నివర్ తుఫాను
ఆంధప్రదేశ్, తెలంగాణాలతో ,తమిళ రాష్ట్రాలకు ముప్పు
తమిళనాడుపై ‘తీవ్ర తుఫాను’ ప్రభావం
చెన్కైకి 630 కిలోవిూటర్ల దూరంలో కేందీకతం
ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్ !
చెన్నై,నవంబర్23 (జనంసాక్షి): ఆంధప్రదేశ్, తెలంగాణాలతో పాటు.. తమిళనాడు రాష్ట్రానికి తుఫాను ముప్పు పొంచివుంది. ఆగ్నేయ బంగాళా ఖాతాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతం విూదుగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం వాయుగుండంగా, మంగళవారం తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. ఈ తుపానుకు ఇరాన్ దేశం సూచించిన ‘నివర్’ అని పేరుపెట్టారు. ఈ తుఫాను బుధవారం తమిళనాడు, పుదుచ్చేరి తీరంలోని కారైక్కాల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే కోస్తాంధ్రలో వర్ష ప్రభావం ఉందని, రాయలసీమలో మంగళవారం నుంచి, బుధవారం నుంచి తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల వెంబడి గంటకు 45 నుంచి 75 కిలోవిూటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అందువల్ల జాలర్లు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు, అరేబియా సముద్రంలో ఇప్పటికే ఏర్పడిన ‘గతి’ తుఫాను కొనసాగుతోంది. అయితే, ఇది పశ్చిమ తీరానికి దూరంగా కేంద్రీకతమైవున్నప్పటికీ.. వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. బంగాళాఖాతంలో నివర్ తుఫాను ఏర్పడనుండటంతో ప్రభుత్వం అలెర్టయింది. ఈ తుఫాను కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం చూపే అవకాశమున్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. వ్యవసాయ, వైద్యారోగ్య, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖలను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. అయితే కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట సహా మినుము, పత్తి, సన్ ప్లవర్ తదితర పంటలకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. పంట కోతలు వీలైనంత త్వరగా చేపట్టాలని రైతులకు హెచ్చరికలు జారీ చేసింది ప్రభుత్వం. అలానే వైద్య బందాలను కూడా సిద్ధం వైద్యారోగ్యశాఖ చేసుకుంటుంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యవసర మందులు సిద్ధంగా ఉంచుకోవాలి అంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. అంబులెన్సులను అందుబాటులో ఉంచాల్సిందిగా జిల్లా వైద్యాధికారులకు సూచనలు చేశారు. నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప జిల్లాలు తుపానుతో తీవ్రంగా ప్రభావితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రకాశం, గుంటూరు, కష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఐఎండీ అంచనా వేస్తోంది.