దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు
24 గంటల్లో 391 మంది కరోనాకు బలి
న్యూఢల్లీి,డిసెంబర్3 (జనంసాక్షి) : దేశంలో కొత్తగా 9216 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,15,757కు చేరింది. ఇందులో 3,40,45,666 మంది కరోనా నుంచి కోలుకోగా, 99,976 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,70,115 మంది మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 391 మంది కరోనాకు బలవగా, 8612 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ గురించి దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కొంత స్టడీ చేశారు. ఆందోళనకరమైన ఈ వేరియంట్‌పై కొన్ని అంశాలను వెల్లడిరచారు. ఒమిక్రాన్‌తో రీఇన్‌ఫెక్షన్‌కు అధిక అవకాశాలు ఉన్నట్లు తేల్చారు. డెల్టా లేదా బీటా స్టెయ్రిన్ వైరస్‌లతో పోలిస్తే.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వల్ల ఇన్‌ఫెక్షన్లు మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ దేశానికి చెందిన ఆరోగ్యశాఖ సేకరించిన డేటా ఆధారంగా ఈ విషయాన్ని తేల్చారు. దీనికి సంబందించిన రిపోర్ట్‌ను మెడికల్ జర్నల్‌లో అప్‌లోడ్ చేశారు. అయితే నిపుణులు ఈ నివేదికను పరిశీలించాల్సి ఉంది. సుమారు 28 లక్షల మంది పాజిటివ్ తేలగా.. వారిలో 35,670 మందికి రీఇన్‌ఫెక్షన్ వచ్చినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 90 రోజుల వ్యవధి తర్వాత మళ్లీ పరీక్ష చేస్తే, అప్పుడు పాజిటివ్ వస్తే ఆ కేసుల్ని రీఇన్‌ఫెక్షన్లుగా భావిస్తారు.