దేశంలో ధరలు,నిరుద్యోగం పెరుగుదల
మోదీ వైఫల్యమే అందుకు కారణం: రాహుల్
న్యూఢల్లీి,డిసెంబర్8జనం సాక్షి :కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం పెరిగిపోవడం, వ్యవసాయ సంక్షోభం ఇవన్నీ? మోదీ ప్రభుత్వం వల్లేనని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. వీటిని సరిచేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. తాము పరిపాలిస్తున్న రాష్టాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శ్రద్ధగా వింటున్నామని, వాటిని పరిష్కరించే దిశగా కదులుతున్నామని అన్నారు. దీంతో పాటు కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు తమ నిరసన గళాన్ని వినిపిస్తూనే ఉన్నామన్నారు. ‘ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం, చైనా దురాక్రమణ? వీటన్నింటికీ ఏకైక కారణం మోదీ వైఫల్యమే. అహంకారమే. స్నేహితులపై ఆయనకున్న ప్రేమే‘ రాహుల్ ట్విట్టర్ వేదికగా ్గªర్ అయ్యారు.