దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు
మరోమారు రాష్టాల్రను హెచ్చరించిన కేంద్రం
న్యూఢల్లీి,అగస్ట్6(జనం సాక్షి)): దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఢల్లీి, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో కేసుల నమోదు ఎక్కువగా ఉంది. ఈ ఏడు రాష్టాల్ల్రో వారాంత కరోనా పాజిటివిటీ రేటు పది శాతానికిపైగా ఉన్నది. దీంతో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. ఈ ఏడు రాష్టాల్ర ఆరోగ్య శాఖ కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. కరోనా నియంత్రణకు ఐదు రెట్ల వ్యూహాన్ని అమలు చేయాలని, కరోనా ప్రవర్తనా నియమావళిని పాటించాలని తెలిపారు. అలాగే అర్హులకు కరోనా టీకా డ్రైవ్‌ను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. మరోవైపు రానున్న నెలల్లో పలు పండుగలు ఉన్నాయి. బహిరంగ ప్రదేశాల్లో జన రద్దీ, సామూహిక కార్యక్రమాలు మరింతగా పెరుగుతాయి. దీంతో కరోనా వైరస్ మరింతగా వ్యాపించే అవకాశమున్నదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆ ఏడు రాష్టాల్రను హెచ్చరించింది. కరోనా కేసులు, మరణాలు పెరుగవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించింది.