దేశంలో ప్రజల అవసరాలకు తగ్గట్లుగా లేని వైద్యరంగం

 

జిల్లా ఆస్పత్రుల్లో లక్ష మందికి 24 బెడ్స్‌ మాత్రమే
కేవలం 6 బెడ్లతో చివరి స్థానంలో నిలిచిన బీహార్‌
దేశంలోని ఆస్పత్రుల సమర్థతపై నీతి ఆయోగ్‌ నివేదిక
న్యూఢల్లీి,అక్టోబర్‌1 (జనం సాక్షి) : దేశంలోని జిల్లా హాస్పిటల్స్‌పై నీతి ఆయోగ్‌ నివేదిక విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం.. దేశంలో సగటున ఒక జిల్లా హాస్పిటల్‌లో లక్ష మందికి 24 బెడ్స్‌ మాత్రమే ఉన్నాయి. ఇక ప్రతి లక్ష మందికి కేవలం 6 బెడ్లతో బీహార్‌ చివరి స్థానంలో ఉండగా.. 222 బెడ్లతో పుదుచ్చెరి తొలి స్థానంలో ఉన్నట్లు నీతి ఆయోగ్‌ తెలిపింది. జిల్లా ఆసుపత్రుల పనితీరుకు సంబంధించిన ఈ రిపోర్ట్‌ను గురువారం నీతి ఆయోగ్‌ విడుదల చేసింది. ఈ తాజా నివేదికను నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌, సీఈవో అమితాబ్‌ కాంత్‌, డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి రోడెరికో ఆఫ్రిన్‌ సమక్షంలో రిలీజ్‌ చేశారు. ఇండియన్‌ పబ్లిక్‌ హెల్త్‌ స్టాండర్డ్స్‌ 2012 ప్రకారం.. సగటున ఒక జిల్లా హాస్పిటల్లో ప్రతి లక్ష మందికి కనీసం 22 బెడ్స్‌ కచ్చితంగా ఉండాలి. దేశంలోని జిల్లా హాస్పిటల్స్‌లో ప్రతి లక్ష మందికి కనిష్ఠంగా 1 నుంచి గరిష్ఠంగా 408 బెడ్స్‌ ఉన్నాయి. 217 జిల్లా హాస్పిటల్స్‌లో కనీసం 22 బెడ్స్‌ ఉన్నాయి అని ఈ నివేదిక వెల్లడిరచింది. కొవిడ్‌`19 మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతున్న సమయంలో ఈ అధ్యయనం నిర్వహించారు. దీని ప్రకారం.. కొవిడ్‌ మహమ్మారి తీవ్ర రూపం దాల్చిన సమయంలో దేశంలోని జిల్లా ఆసుపత్రుల్లో తగినన్న వసతులు లేవని తేలింది. ఇక దేశంలోని 15 రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని జిల్లా హాస్పిటల్స్‌లో ప్రతి లక్ష మంది జనాభాకు 22 బెడ్స్‌ కంటే తక్కువగా ఉన్నాయి. ఇందులో బీహార్‌ (6) చిట్టచివరి స్థానంలో ఉంది. తెలంగాణలోని జిల్లా హాస్పిటల్స్‌లో ప్రతి లక్ష మందికి 10 బెడ్స్‌ అందుబాటులో ఉన్నట్లు నీతి ఆయోగ్‌ అధ్యయనం తేల్చింది. ఇక 21 రాష్టాల్రు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అవసరమైన 22 బెడ్స్‌ కంటే ఎక్కువ బెడ్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో పుదుచ్చెరి (222) ముందుండగా.. 200 బెడ్స్‌తో
అండమాన్‌ నికోబార్‌ దీవులు, 150తో లడాఖ్‌, 102తో అరుణాచల్‌ ప్రదేశ్‌, 102తో డమన్‌ / డయ్యు టాప్‌ 5లో ఉన్నాయి.