దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించం

ఆర్‌బిఐ ద్వారా డిజిటల్‌ కరెన్సీకియత్నం

లోక్‌సభలో వెల్లడిరచిన నిర్మలా సీతరామన్‌

న్యూఢల్లీి,నవంబర్‌29(జనం సాక్షి): దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ఏదీ లేదని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ తెలిపారు. బిట్‌కాయిన్‌ లావాదేవీలపై సమాచారాన్ని ప్రభుత్వం సేకరించడం లేదన్నారు. సోమవారం లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ స్పష్టత ఇచ్చారు. బిట్‌కాయిన్‌ అనేది డిజిటల్‌ కరెన్సీ. బ్యాంకులు, క్రెడిట్‌ కార్డులను జారీ చేసే సంస్థలు లేదా ఇతరుల ప్రమేయం లేకుండా వస్తువుల కొనుగోలు, సేవల కొనుగోలు, ధన మార్పిడికి దీనిని ఉపయోగించవచ్చు. దీనిని 2008లో గుర్తు తెలియని ప్రోగ్రామర్ల బృందం ప్రారంభించింది. ఇదిలావుండగా, భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా అధికారికంగా డిజిటల్‌ కరెన్సీని అందుబాటులోకి తేవడానికి భారత ప్రభుత్వం ప్రయత్నిస్తు న్నట్లు తెలిసింది. దీంతోపాటు కొన్ని ప్రైవేటు క్రిఎª`టోకరెన్సీలు మినహా మిగిలిన క్రిప్టోకరెన్సీలను నిషేధిస్తూ ఓ బిల్లును ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టబోతోంది. క్రిప్టోకరెన్సీ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ అఫిషియల్‌ డిజిటల్‌ కరెన్సీ బిల్లు, 2021ని ప్రతిపాదించనుంది. బిట్‌ కాయిన్‌ పై కేంద్రం వైఖరిని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌  పార్లమెంటులో స్పష్టం చేశారు. బిట్‌ కాయిన్‌ ను కరెన్సీగా గుర్తించే యోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. బిట్‌ కాయిన్‌ ను కరెన్సీగా పరిగణించే ప్రతిపాదనలేవీ కేంద్రం చేయలేదని నిర్మలా వివరించారు. బిట్‌ కాయిన్‌ లావాదేవీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిం చామన్న ప్రచారంలో నిజంలేదన్నారు. శీతాకాల పార్లమెంట్‌ సమావేశాల్లో భాగంగా  లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆమె ఈ వివరణ ఇచ్చారు. ఆర్బీఐ ద్వారా సొంత డిజిటల్‌ కరెన్సీ రూపొందించేందుకు కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో  దేశంలో బిట్‌ కాయిన్‌ తరహా ఇతర క్రిప్టోకరెన్సీలను అనుమతించేది లేదని నిర్మలా సీతారామన్‌  చెప్పిన మాటల్లో స్పష్టమైంది.