దేశంలో రాజ్యాంగం ఎంతో విశిష్టమైంది

కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ,నవంబర్‌18(జ‌నంసాక్షి): రాజ్యాంగం అనేది నూతన దేశాన్ని తయారు చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తుందని కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ అన్నారు. బుధవారం జరిగిన ఓ సమావేశంలోరాజ్యాంగ గొప్పదనాన్ని తెలిపారు. అది మనకు ఎంతో నేర్పిస్తుందని ఆయన తెలిపారు. దాని ద్వారా మనం క్రమశిక్షణతో పాటుగా భిన్నత్వంలో ఏకత్వాన్ని నేర్పిస్తుందని చెప్పారు. ‘రాజ్యాంగం మనకు భిన్నత్వంలో ఏకత్వంతోపాటుగా సమానత్వాన్ని, సమాజిన విజ్ఞానాన్ని, సరైన జీవనా శైలిని నేర్పిస్తుందని తెలిపారు. దీని ద్వారా మనం అనే భావన కలుగుతుంది. మనం అంటేనే ఎంతో అర్థం వస్తుంది దాన్ని మనం అర్థం చేసుకొని ఇతరులకు తెలిచజేయాలి. నూతన భారత దేశాన్ని తయారు చేయడానికి రాజ్యాంగం ఎంతో ముఖ్యమ’ని అన్నారు. అయితే రాజ్యాంగం గొప్పతనం గురించి రాజ్యాంగ రోజు సందర్భంగా నేషనల్‌ కాడెట్‌ కార్ప్స్‌ (ఎన్‌సీసీ) ఏర్పరచిన సభలో మాట్లాడారు. అంతేకాకుండా యువతకు రాజ్యంగ విశిష్టత తెలియాలని అన్నారు. ఒక దేశ రాజ్యాంగం ఆ దేశ ప్రజలను చూపుతుందని, మన దేశ రాజ్యాంగం మనకు కలిసికట్టుగా ఐకమత్యంతో ఉండాలని నేర్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.