దేశంలో సకల దరిద్రాలకు కాంగ్రెస్సే కారణం
కాంగ్రెస్ లేకుంటే ఎమర్జెన్సీ వచ్చేదికాదు
కాంగ్రెస్ లేకుంటే సిక్కుల ఊచకోత జరిగేది కాదు
కాంగ్రెస్ మైండ్‌సెట్ అర్బన్ నక్సలైట్లను తలపిస్తోంది
కాంగ్రెస్ విధానాల కారణంగానే పండిట్లు కాశ్మీర్ విడిచారు
కరోనా సంక్షోభాన్ని దేశం ఐక్యంగా ఎదుర్కొంది
ప్రపంచదేశాలకు మన వ్యాక్సిన్లు ఆక్సిజన్‌లా పనిచేశాయి
కరోనా సంక్షోభంలో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి దెబ్బతింది
వారసత్వ రాజకీయాలు దేశానికి ముప్పని హెచ్చరిక
కాంగ్రెస్‌ను రెండోరోజూ ఏకి పారేసిన ప్రధాని మోడీ
రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి సమాధానం
ప్రధాని మోడీ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ వాకౌట్
న్యూఢల్లీి,ఫిబ్రవరి8(జనం సాక్షి): దేశంలో సర్వ అరిష్టాలకు కాంగ్రెస్ కారణమంటూ ప్రధాని మోడీ మరోమారు ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ లేకుంటే ఎమర్జెన్సీ వచ్చి ఉండేది కాదని,సిక్కుల ఊచకోత జరిగేది కాదంటూ విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ చేస్తోన్న వారసత్వ రాజకీయాలు దేశానికి ఎంతో ప్రమాదకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ లేకుంటే దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తేవి కావని, సిక్కుల ఊచకోత లాంటి సంఘటనలు జరిగేవి కావని మోడీ ధ్వజమెత్తారు. అంజయ్య లాంటి సొంత పార్టీ నేతలనే అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకుందని మోడీ ధ్వజమెత్తారు.
కాగా సోమవారం లోక్‌సభ చర్చలోనే కాంగ్రెస్‌పై ఘాటైన విమర్శలు చేసిన మోడీ మంగళవారం మరోసారి ఆ పార్టీపై విరుచుకుపడ్డారు. ’కాంగ్రెస్ నేతల మైండ్‌సెట్ అర్బన్ నక్సలైట్లను తలపిస్తోందని అన్నారు. వారివల్లే దేశంలో అవినీతి చీడ వ్యాపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ విధానాల కారణంగానే కశ్మీర్ పండిట్లు కశ్మీర్‌ను విడిచి వెళ్లారని ప్రధాని ధ్వజమెత్తారు. కుటుంబపాలన కన్నా ఎక్కువ ఏదీ లేదన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు ప్రధాని మోదీ విమర్శించారు. భారత ప్రజాస్వామ్యానికి అతి పెద్ద ప్రమాదం డైనాస్టిక్ పార్టీలు అని, ఆ ప్రమాదాన్ని గుర్తించాలని ఆయన అన్నారు. పార్టీలో ఏదైనా కుటుంబం కీలకమైతే, అప్పుడు ట్యాలెంట్ ఉన్నవాళ్లు బలికావాల్సిందే అని ఆరోపించారు. అర్బన్ నక్సల్స్ తరహాలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన మారిందన్నారు. ఇది దేశాం చింతించే విషయమన్నారు. కాంగ్రెస్ ఉంటే దేశానికి ఏమౌతుందో గాంధీకి తెలుసు అని, అందుకే ఆ పార్టీని నిర్వీర్యం చేయాలని గాంధీ భావించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. మహాత్మా గాంధీ ఆశించినట్లు కాంగ్రెస్ పార్టీని రద్దు చేసి ఉంటే.. కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యం విముక్తి అయ్యేదన్నారు. జాతీయ తీర్మానాల దిశగా దేశం ముందుకు వెళ్లేదన్నారు. కాగా మోడీ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ నేతలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. సోమవారం కూడా లోక్‌సభలో మోడీ కాంగ్రెస్‌పై నిప్పులు కక్కిన సంగతి తెలిసిందే. ఓటముల తర్వాత కూడా కాంగ్రెస్‌కు అహంకారం తగ్గలేదని విమర్శించారు. కాంగ్రెస్‌కు తానంటే ప్రాణమని, మోడీ లేకుండా వారు ఒక్క క్షణం కూడా జీవించలేరని విమర్శించారు. కరోనా సమయంలో కాంగ్రెస్ తన హద్దులను దాటి ప్రవర్తించిందని ప్రధాని మోడీ ఆరోపణలు గుప్పిం చారు. కరోనా వైరస్ వ్యాప్తిని చేసింది
వారేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కోవిడ్`19 ఓ మహమ్మారి అని, కరోనా లాంటి సంక్షోభాన్ని గత వందేళ్లలో ఎన్నడూ మానవాళి చూడలేదని ప్రధాని మోదీ అన్నారు. రూపం మారుతున్న ఆ మహమ్మారి ప్రజలను ఇబ్బందిపెట్టిందన్నారు. ఇండియాతో పాటు యావత్ ప్రపంచం కూడా కరోనాపై పోరాటం చేస్తోందన్నారు. కోవిడ్ మొదలైన సమయంలో.. ఇండియా ఏమౌతుందని అందరూ చర్చించారని, ఇండియా వల్ల ప్రపంచంపై ఎటువంటి ప్రభావం ఉంటుందో అని కూడా ఆందోళన చెందారని, కానీ 130 కోట్ల మంది భారతీయుల ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పట్ల ప్రపంచదేశాలు హర్షం వ్యక్తం చేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కోవిడ్ లాక్‌డౌన్ తర్వాత ఐటీ సెక్టార్‌లో ఉద్యోగ అవకాశాలు పెరిగినట్లు ఆయన చెప్పారు. తొలి లాక్‌డౌన్ సమయంలో సుదీర్ఘ చర్చల తర్వాత చాలా కీలకమైన, ధైర్యమైన నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్ నుంచి రైతులకు మినహాయింపు ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. అది చాలా కీలకమైన నిర్ణయమన్నారు. దాని ఫలితంగా రికార్డు స్థాయిలో రైతులు పంటను పండిరచినట్లు మోదీ తెలిపారు. కరోనా మహమ్మారి వేళ యువత దేశం గర్వపడేలా చేశారని, క్రీడారంగంలో యువత రాణించినట్లు ఆయన తెలిపారు. మహమ్మారి ప్రభావం క్రీడలపై పడకుండా చూశారన్నారు. క్రీడాకారులు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చినట్లు చెప్పారు. కరోనాపై పోరాటంలో భారతీయ చికిత్సా విధానానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లు ప్రధాని మోదీ తెలిపారు. కరోనా వేళ తెలంగాణ, ఏపీ రాష్టాల్ర నుంచి పసుపు ఎగుమతులు పెరిగినట్లు ఆయన చెప్పారు. కరోనా నియంత్రణలో భారతీయ చికిత్సా విధానం బాగా పనిచేసిందన్నారు. ఆ విధానాలు ప్రపంచ దేశాలను ఆకర్షించినట్లు ఆయన చెప్పారు. హోలిస్టిక్ హెల్త్ కేర్ విధానంపై తమ ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. ఆధునిక చికిత్సతో పాటు భారతీయ ప్రాచీన చికిత్స విధానాన్ని కూడా కరోనా సమయంలో అవలంబించినట్లు ప్రధాని వెల్లడిరచారు. ఆయుష్ మంత్రాలయం కూడా బాగా పనిచేసిందన్నారు. కరోనాపై ప్రజెంటేషన్ కోసం ఆల్ పార్టీ విూటింగ్ నిర్వహిస్తే, కాంగ్రెస్ పార్టీ ఆ సమావేశానికి డుమ్మా కొట్టిందని, అంతేకాదు, ఇతర పార్టీలను వెళ్లకుండా చేసే ప్రయత్నం చేసినట్లు ఆయన ఆరోపించారు. గత రెండేళ్లలో గత కొన్ని పార్టీలు అపరిపక్వత ప్రదర్శించినట్లు ఆయన విమర్శించారు. స్వార్ధపూరిత రాజకీయాలను కొన్ని పార్టీలు ప్రదర్శించినట్లు ఆయన వెల్లడిరచారు. భారతీయ వ్యాక్సిన్లకు వ్యతిరేకంగా కూడా కొందరు ప్రచారం నిర్వహించినట్లు మోదీ ఆరోపించారు. ప్రపంచ దేశాలన్నిటినీ ద్రవ్యోల్బణం ప్రభావితం చేసిందని, యూరో కరెన్సీ అమల్లో ఉన్న దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం అధికంగా ఉందని, కేవలం మన దేశంలో మాత్రమే దీనిని అదుపులో ఉంచగలిగామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మితమైన ద్రవ్యోల్బణం, ఘనమైన ఆర్థికాభివృద్ధి ద్రవ్యోల్బణం యావత్తు ప్రపంచాన్ని కుదిపేస్తోందని చెప్పారు. 40 ఏళ్ళ గరిష్ఠస్థాయి ద్రవ్యోల్బణం అమెరికాలో ఉందని, 30ఏళ్ళ గరిష్ఠ స్థాయిలో బ్రిటన్‌లో ఉందన్నారు. యూరో కరెన్సీ అమల్లో ఉన్న దేశాల్లో కూడా ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో తాము 2015`2020 మధ్య కాలంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచేందుకు ప్రయత్నించామన్నారు. ఈ కాలంలో ద్రవ్యోల్బణం రేటు 4 శాతం నుంచి 5 శాతం వరకు ఉండేదన్నారు. కాంగ్రెస్ నేత?త్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో ద్రవ్యోల్బణం రెండంకెల సంఖ్యలో ఉండేదని చెప్పారు. నేడు మితమైన ద్రవ్యోల్బణం, అధిక వృద్ధి రేటు ఉన్న ఏకైక భారీ ఆర్థిక వ్యవస్థ భారత దేశమేనని చెప్పారు. కోవిడ్ వల్ల భారీ సంక్షోభం100 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత విపత్తు కోవిడ్`19 మహమ్మారి రూపంలో వచ్చిందన్నారు. ఇటువంటి విపత్తును వందేళ్ళలో మానవాళి కనీ వినీ ఎరుగదని చెప్పారు. ఈ సంక్షోభం
తన రూపాలను మార్చుకుంటూ, ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తోందన్నారు. యావత్తు భారత దేశం, ప్రపంచం దీనితో పోరాడుతోందని చెప్పారు. సమాజంలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రజలందరికీ ఈ మహమ్మారి సమయంలో కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల ఈ మహమ్మారి నుంచి బయట పడటం కోసం కొత్త విధానాలతో చర్యలు తీసుకోవచ్చుననే భరోసా కలిగిందన్నారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వడం ద్వారా ప్రపంచానికి ఓ ఉదాహరణగా మన దేశం నిలిచిందన్నారు. భారత దేశంలోనే తయారైన వ్యాక్సిన్లను ఇస్తూ, కోవిడ్`19 వ్యాక్సినేషన్‌ను అత్యధికంగా చేపట్టిన దేశంగా భారత దేశం నిలిచిందని తెలిపారు. మన దేశంలో తయారైన వ్యాక్సిన్లు కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా మన పొరుగు దేశాలకు కూడా అందించినట్లు తెలిపారు. కాంగ్రస్ పాలనలో లేకుంటే ఈ దేశ ఆడపడుచుల్ని తందూర్‌లో వేసేవాళ్లు కాదని మోదీ విమర్శించారు. ప్రధాని మోదీ విరుచుకుపడ్డ తీరును ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై సమాధానం ఇవ్వకుండా.. కాంగ్రెస్ పార్టీని నిందించడమే పనిగా ప్రధాని మాట్లాడుతున్నారని విపక్షనేత ఖర్గే ఆరోపించారు.