దేశంలో 8 వేలకు దిగొచ్చిన కరోనా కేసులు
కేరళలో తగ్గిని కేసుల సంఖ్యతమిళనాడులో జోరుగా టీకాల కార్యక్రమం
న్యూఢల్లీి,నవంబర్22(జనం సాక్షి): దేశంలో క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతోంది. రోజువారీ కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. గతేడాది మార్చి తర్వాత ఇంత తక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. రోజువారీ కేసులు 538 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడిరచింది.దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 8488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,18,901కి చేరాయి. ఇందులో 3,39,34,547 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,65,911 మంది మరణించారు. మరో 1,18,443 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు 12,510 మంది కరోనా నుంచి కోలుకోగా, 249 మంది మృతిచెందారని ఆరోగ్య శాఖ వెల్లడిరచింది. ఇక కొత్తగా నమోదైన కేసుల్లో కేరళలోనే 5080 కేసులు ఉన్నాయి. మరో 40 మంది మృతిచెందారు. పుదుచ్చేరిలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండంతో, కరోనా పరీక్షలు అధికం చేయాలని కేందప్రభుత్వం సూచించింది. పుదుచ్చేరిలో రోజువారీ కేసుల సంఖ్య ఈనెల 9న 168 ఉండగా, 16వ తేదీ 238కి పెరిగింది. కారైక్కాల్‌లో 29 శాతం, పుదుచ్చేరిలో 30, యానాంలో 85 శాతం కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదిలావుంటే తమిళనాడులో రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పదో విడత వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. రాష్ట్రమంత టా 50 వేల కేంద్రాల్లో కొవాగ్జిన్, కొవిషీల్ట్ టీకాలు వేశారు. చెన్నైలో వార్డుకు పది శిబిరాల చొప్పున రెండు వందల వార్డులలో రెండు వేల శిబిరాలు నిర్వహించి నగరవాసులకు మొదటి విడత, రెండో విడత కరోనా నిరోధక టీకాలు వేశారు. ఈ శిబిరాల వద్ద టీకాలు వేసుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఈ శిబిరాల్లో మొదటి డోసు, సెకెండ్ డోసు టీకాలు వేశారు. ప్రజలు టీకాలు వేసుకునేందుకు ఆసక్తిగా తరలివచ్చారు. ఈ శిబిరాలకు సెకెండ్ డోసు టీకాలు వేసుకునేందుకు అత్యధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ శిబిరాలను వారానికి రెండు రోజులపాటు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం టీకాల కొరతలేదని, సుమారు కోటి డోసుల మేరకు టీకాలు స్టాకు ఉందని ఆరోగ్యశాఖ మంత్రి ఎం. సుబ్రమణ్యం తెలిపారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హాయంలో అట్టహాసంగా ఏర్పాటు చేసిన అమ్మా క్లినిక్‌లలో పనిచేయడానికి డాక్టర్లు తక్కువ సంఖ్యలో ఉన్నారని, ఏ చోటా నర్సులను నియమించలేదని ఆయన ఆరోపించారు. రెండు వేల అమ్మా క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించుకున్నా, వాస్తవానికి ఐదు వందల అమ్మా క్లినిక్‌లు అరకొర సిబ్బందితో పనిచేస్తున్నాయని తెలిపారు. నగరంలో పదో విడత మెగా శిబిరంలో సుమారు రెండు లక్షల మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ 80 శాతం మంది మొదటి డోసు టీకాలు వేసుకున్నారని, 30 శాతం మంది రెండో డోసు టీకాలు వేసుకున్నారని ఆయన చెప్పారు. ప్రస్తుతం సెకెండ్ డోసు వేసుకోవాల్సినవారిని ఆరోగ్య కార్యకర్తలు టీకాల శిబిరాల వద్దకు తరలిస్తున్నారని మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.