దేశం కోసం పాటుపడుతున్న ఇంకా విమర్శలేనా?
విూడియాపై విరుచుకుపడ్డ అమెరికా అధ్యక్షుడు
బాధ్యతలేకుండా ప్రవర్తిస్తున్నారని జర్నలిస్టులపై మండిపాటు
న్యూయార్క్,జూలై30(జనం సాక్షి): అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ .. ఆ దేశ విూడియాపై మరోమారు విరుచుకుపడ్డారు. జర్నలిస్టులు దేశభక్తిలేనివారంటూ విమర్శలు గుప్పించారు. తమ రిపోర్టింగ్ శైలితో ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. తాజాగా తన ట్విట్టర్ ద్వారా స్పందించిన ట్రంప్.. జర్నలిస్టులు విధేయత కోల్పోయారన్నారు. ప్రతికా స్వేచ్ఛ అంటే వార్తలను బాధ్యతాయుతంగా రిపోర్ట్ చేయాలని, కానీ విూడియా అలా వ్యవహరించడం లేదని ట్రంప్ అన్నారు. ప్రభుత్వ ఆంతరంగిక విషయాలను రిపోర్ట్ చేసిన విూడియాపై ట్రంప్ ్గ/ర్ అయ్యారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ ఓనర్‌తో జరిగిన ఇంటర్వ్యూ అనంతరం ఆయన తన ట్వీట్లతో రెచ్చిపోయారు. తన ప్రభుత్వం గురించి విూడియా 90 శాతం దుష్పచ్రారం చేస్తున్నదని, తామెంత పాజిటివ్‌గా ఉన్నా, విూడియాలో మాత్రం తమ పట్ల సరైన అభిప్రాయం లేదన్నారు. జీవంలేని వార్తాపత్రిక పరిశ్రమ కోసం పనిచేస్తున్న ప్రభుత్వ వ్యతిరేకులను సహించబోమని ట్రంప్ అన్నారు. అమెరికా ప్రజల కోసం తన పోరాటాన్ని ఆపనన్నారు. ప్రభుత్వం ఎన్ని సాధిస్తున్నా.. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ మాత్రం తమ గురించి చెడు వార్తలే రాస్తున్నారని ట్రంప్ విమర్శించారు.