దేశభక్తి నా రక్తంలోనే ఉంది…

4070k41w

న్యూఢిల్లీ: తన రక్తంలో హృదయంలో దేశ భక్తి నిండిఉందని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. తన దేశభక్తిని గురించి బీజేపీ ప్రశ్నించాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ దేశం కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని తమ కుటుంబాన్ని కూడా త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గురువారం ఆయన జేఎన్యూ పరిణామాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివేదిక సమర్పించారు. పటియాల కోర్టులో లాయర్లు అక్కడికొచ్చిన జర్నలిస్టులను, విద్యార్థులను, ఇతరుల కొడుతుంటే పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించిందని అన్నారు.

జేఎన్యూ సమస్యను పరిష్కరించడంలో విఫలమైన కేంద్ర ప్రభుత్వం ఆ విషయాన్ని మరింత పెద్దది చేస్తుందన్నారు. ఆరెస్సెస్ తన భావజాలాన్ని, సిద్ధాంతాన్ని దేశంపై రుద్దాలనుకుంటోందని చెప్పారు. విద్యార్థుల వల్లే దేశం పురోగతిలోకి వెళుతుందని, వారు తమ ఆలోచనలను, కన్న కలలను ఆవిష్కరణలుగా మలిచి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప జేస్తున్నారని అన్నారు. అలాంటి విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లో రక్షణ కల్పించాల్సిన బాద్యత ప్రభుత్వాలపై ఉందని అన్నారు.