దేశవ్యాప్తంగా ఎన్‌ఆర్‌సీ అమలు

– రాజ్యసభలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి అమిత్‌షా
న్యూఢిల్లీ,నవంబర్‌ 20(జనంసాక్షి): దేశవ్యాప్తంగా జాతీయ పౌర జాబితా (ఎన్‌ఆర్‌సీ) అమలు చేస్తామని కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. రాజ్యసభలో బుధవారం కశ్మీర్‌ పరిస్థితిపై సమాధానం చెబుతూ జాతీయ పౌర జాబితా అంశాన్ని కూడా ప్రస్తావించారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే ఎన్‌ఆర్‌సీ పక్రియను నడుస్తోందని, ఈ పక్రియ ఏ ఒక్క మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం కానీ, తొలగించడం కానీ ఉండదన్నారు. అన్ని మతాల ప్రజలకు ప్రభుత్వం ‘ఆశ్రయం’ కల్పిస్తుందని చెప్పారు. అసోంలో ఎన్‌ఆర్‌సీ తుది జాబితాలో పేర్ల తొలగింపుపై మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌సీ జాబితాలో పేర్లు లేని వారికి ట్రిబ్యునల్‌ను ఆశ్రయించే హక్కు ఉంటుందని, లీగల్‌ ఖర్చులు భరించలేని విషయంలో అసోం ప్రభుత్వమే సొంతంగా ఖర్చులు భరిస్తుందని అమిత్‌షా చెప్పారు. లాయర్‌కు అయ్యే ఖర్చులు సమకూరుస్తుందని తెలిపారు. హిందువులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్లు, పార్శీ శరణార్థులు భారత పౌరసత్వం పొందుతారని, అందుకోసమే పౌరసత్వ సవరణ బిల్లు అవసరమైందని చెప్పారు. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్థాన్‌లో వివక్షకు గురైన ఈ శరణార్థులందరికీ భారత పౌరసత్వం లభిస్తుందని అమిత్‌షా పేర్కొన్నారు.