దేశవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్
న్యూఢల్లీి,డిసెంబర్25(జనం సాక్షి): దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి. చర్చిలన్నీ పండగ కళను సంతరించుకున్నాయి. భక్తులంతా అర్థరాత్రి నుంచే వేడుకల్లో పాల్గొంటున్నారు. కర్ణాటకలోని బెంగళూరులో అన్ని చర్చిల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. కోవిడ్ నిబంధనల మధ్య వేడుకలు జరుపుకున్నారు..పుదుచ్చేరిలో పెద్ద ఎత్తున భక్తులు చర్చిలకు తరలివచ్చారు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికులతో పాటు.. విదేశీయులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలసి ఉండేలా ఏసు ప్రభువు దీవించాలని అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రపంచ శాంతి కోసం ఏసు జన్మించాడని, అదే విశ్వాసంతో కైస్త్రవ సోదరులు వేడుకలు జరుపుకుంటున్నారని అన్నారు. ప్రముఖ చర్చిల్లో అర్థరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.